అమ్మవారి దండకం :-మచ్చ.అనురాధ.సిద్దిపేట.తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
శ్రీమన్ మహాదేవి  శ్రీమంగళా గౌరి ,
శ్రీ రాజ రాజేశ్వరీదేవి మమ్మేలు ,
త్రైలోక్య మందుండె  శక్తిస్వరూపంబు ,
ఓఅంభికేశ్వరీ  ఓశాంభవీమాత ,
శ్రీ శైలమళ్లీశ్వరీదేవి మాంపాహి ,
ఓభక్త చింతామణీపావనీగావ ,
మాయాపదల్ దీర్చ 
రావేల జాగేల ,
మాబిడ్డలన్ బ్రోచి 
సంస్కారమున్ నేర్పి ,
విద్యాగరిష్ఠుల్ని జేయమ్మ ఇంద్రాణి ,
నీకన్న మాకెవ్వరున్నారు  మాయమ్మ ,
నిత్యంబు ధ్యాన్నింతు  ఓంకార  శ్రీశక్తి ,
మాశక్తి లోపంబు లేకుండ  నీపూజ ,
సల్పేము  పక్వాన్నముల్ బెట్టి  ప్రార్థింతు మోయమ్మ
యారోగ్యమున్నుండ జేయమ్మ  హేదుర్గ ,
శ్రీవేములావాడ యందుండె  చిధ్రూపి  ,
మీనాక్షి  ఓకంచి కామాక్షి లోకాల ,
సంరక్షసంధాయినీ దేవి  మాంపాహి ,
నావాక్యముల్ నందు లోపంబులున్ నున్న ,
మన్నించు నీభక్తు లన్ బ్రోవు మమ్మేలు,
 తల్లీమహంకాళి శాంతంబు  జూపించి ,
నీభక్తులీదండకంబేయ  నీదృష్టి  ,
సారించి  రక్షించు సౌఖ్యంబు లన్నిచ్చి 
శ్రీశ్యామలాదేవి సర్వంబు  నీవమ్మ 
మాతా నమస్తే నమస్తే నమః .




కామెంట్‌లు