విశ్వమంత ఉన్నది శివుని గుప్పెట్లో
ఆ శివుని గుప్పెట్లో
ఉత్సాహం ఉల్లాసం శివుని గుప్పెట్లో
ఆ శివుని గుప్పెట్లో
::విశ్వ ::
పురికొల్పే కోరికలు శివుని గుప్పెట్లో
జీవిత పరమార్థం శివుని గుప్పెట్లో
ఆశయాలు అదృష్టం శివుని గుప్పెట్లో
అనురాగం మమకారం శివుని గుప్పెట్లో
:: విశ్వ::
సృష్టి రహస్యాలు శివుని గుప్పెట్లో
చిదంబర రహస్యాలు శివుని గుప్పెట్లో
బ్రహ్మాండం బంధించే శివుని గుప్పెట్లో
సార్థకం పరమార్ధం శివుని గుప్పెట్లో
::విశ్వ::
మంచికి మోక్షము శివుని గుప్పెట్లో
చెడుకు శిక్షలు శివుని గుప్పెట్లో
విజయాలకు మార్గాలు శివుని గుప్పెట్లో
జీవిత పరమార్థాలు శివుని గుప్పెట్లో
:: విశ్వ:
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి