వందేమాతరం:-- యామిజాల జగదీశ్

త్యాగమూర్తులందరి
అకుంఠిత దీక్షతో
ఐకమత్యంతో
హింసాకాండను అణచివేసి
పురోగమిస్తున్న మన భారతావనికి
వందేమాతరం!

సాంకేతిక పరిజ్ఞానంలోనూ
భద్రతా రంగంలోనూ
దీటైన శక్తియుక్తులతో 
విప్పారుతున్న భారతావనిలో 
మంచి కాలం మరింతగా 
వికసించాలనే 
వందేమాతరం!


ఇరుగుపొరుగు దేశాలతో
సంబంధాలూ
ప్రియమై వికసించి
పరిమళించాలని
ఘర్షణలు లేని 
మైత్రీ బంధం అందచందాలతో
ఇక సంతోషాలకు లోటు లేని రీతిలో
పురోగమించే భారతావనికి
వందేమాతరం!

శాస్త్రీయ వృద్ధి
పలువురు మేధావులు పుట్టుకొస్తున్న వేళ
సత్య జ్ఞానంతో వికసించే
భారతావనికి వందేమాతరం!

దేశరక్షణలో సైన్యంతో
ఏ సవాలునైనా ఎదురొడ్డే ధీమంతులతో
వికసించే భారతావనికి
వందేమాతరం!

విద్య
కళలు
పారిశ్రామిక రంగం
ఇంకా మరెన్నింటిలోనో
వికసిస్తున్న భారతావనికి
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!


కామెంట్‌లు