రక్ష- సాహితీసింధు సరళగున్నాల

కం*కట్టితిరాఖీలన్నకు
పట్టగనాచేతికిపుడు పండగరోజున్
ముట్టెనుకట్నములెన్నియొ
నట్టింటనువెలుగులెన్నొ నాట్యముజేయన్

ఉ*అన్నకుచెల్లియున్కరమునందున రాఖిని గట్టుచుండగన్
మిన్నగురక్షయేగలిగి మేధినయందునగెల్పుబావుటన్
నెన్నగనల్గురున్మనలనేగగవచ్చును గొప్పస్థానమున్
అన్నులమిన్న బంధమిదియాప్తులునొక్కరికొక్కరైచనన్

శా*చేతన్రాఖిని గట్టియున్ననదియే శ్రేయంబులన్గూర్చుచున్
వ్రాతల్మారునుజీవితమ్మువెలుగన్ రాజిల్లుతోబుట్టువుల్
చేతల్మార సహోదరుల్ పలుకులన్చిందించు నీమేలుకై
మాతన్బోలినయట్టునుండు నొకటై మైమర్చగాసోదరే

కామెంట్‌లు