పట్టుదల--సాహితీసింధు సరళ గున్నాల
చం*చదువగ పట్టుపట్టవలె చాకిరిజేసెడుబాలబాలికల్
సదయులుమెచ్చు రీతిగని శ్రద్ధగవిద్దియలందుకొన్నచో
పదవులనున్నతంబవగ ప్రార్థనజేయుచునమ్మవారినిన్
వదలక భక్తితత్పరత వంతుగనింతయుసాయమీయవా

చం*తలవనికష్టనష్టములు క్రమ్మినచీకటులెల్లవేళలన్
తలపునపట్టివీడకను తాగనలేరుగ భావి,నందుకున్
నిలుపగగొప్పజీవనము నిండుగనాయువునందుచుండన్
మలుపులుదిప్పనేదియును మారకపట్టును పట్టగావలెన్


కామెంట్‌లు