రావే ఎంకీ :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు


ప్రక్రియ*పద్యం-మధురగతి రగడ*
:   ----------------------------
 
రంగము పోదము రావే ఎంకీ 
బంగరు కొందము బాగుగ వంకీ !

కమ్మల జతలూ కాసుల పేరును 
యిమ్ముగ గాజులు యిక ఉంగరమును!

మెడలో గుండ్లను  మేలగు గజ్జెలు 
తడవకు చాలా తళుకుల చీరలు !

పాపిట బిళ్లకు పచ్చని రాళ్ళను 
మాపిటి కంతా మనసొం తమగును !

చిక్కని ఛాయిలు చిలకల దుప్పటి 
చక్కని రొట్టెలు చాలా సంగటి !!

రంగుల రాట్నం రంజుగ వుంటది 
హంగుగ తిరుగా హాయిగ పా టది!
కామెంట్‌లు