బడిలోన పంతులు పాఠాలు చెప్పుచున్
నవ్వులు పూయించు నవ్వినంత,
నాటపాటలతోడ నాయాస మెరుగక
బాలగేయాలెన్నొ పాడి చెప్పు,
ఈ కరోనావ్యాధి యిన్నెలు నెన్నెన్నొ
సెలవులు గడవక చింత కలిగె ,
వంట జేయుచున్నమ్మ ఇంటిలో నుండగ
సెల్లు ను వదలరు క్షేమ మడుగ .
తేటగీతి.
పాడు వైరసునెప్పుడు పారిపోవొ,
బడికి వెళ్లియు టీచర్ను పలకరించ,
గుర్తుకొచ్చిన పాపడు గుక్కపట్టి ,
యేడ్చుచుండెను బాధతో యేలగడుప.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి