చిత్రమునకు పద్యం:-మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
ఉత్పలమాలిక .

మువ్వురు తల్లులున్  కలిసి ముచ్చట లాడుచు  బిడ్డలందరూ ,
నెవ్వతొ కూలుతున్నరని  నీరజ నేత్రియు  చెప్పుచుండెనే  ,
చివ్వుము  శారదా నరుల జీవన బాధలు  పార్వతమ్మనే ,
నవ్వుతు కచ్ఛపీ  కరము నందున దాల్చియు వీణమీటగా ,
జివ్వున తన్మయమ్ములను జెందియు  నిద్దరు నాలకించిరే ,
జవ్వయె జూడగ నిచట శారద , పార్వతి ,లక్ష్మితల్లులన్.

నెవ్వ....బాధ ,లేమి.
చివ్వు,...త్రుంచు .
జవ్వు,...సౌందర్యం.




కామెంట్‌లు