**ఏడు దశాబ్ధాల భారతం**:-**సాగర్ రెడ్డి****చెన్నై**

బిక్షకోసం యాచకుల
ఆరాటంకాదు ఆ పోరాటం.
ఫిరంగులమోతలకు
తుపాకీగుళ్ళ చప్పుళ్ళకు
భయపడని పోరాటమది.
 అందరినీ కదలించి,
అంతులేని కర్కశత్వాన్ని
అంతంచేసిన సమిష్టి
స్వాతంత్ర్య పోరాటమది!!

హింసతో విలవిలలాడినా-
ప్రాణాలు గాలిలో కలసినా,
పట్టువీడని పంతమై
బానిస సంకెళ్ళను
తెంచిన ఉద్యమమది.
వందల వత్సరాల అవిశ్రాంత యుద్దానికి
అందిన ఫలితమే ఈ స్వాతంత్ర్యం, 
ముందు తరాలు మనకు అందించిన స్వాంతనా మంత్రం!!

ఏడు దశాబ్ధాలు దాటాయి,
అంచెలంచెల ఆ పోరాటానికి-
సఫలీకృతమైన అపూర్వ ఘట్టానికి.
అబివృధ్ధి చెందినా,
ఆనందించలేని ఆధిపత్య
పోరాటాలతో నిత్యం
సతమతమయ్యే 
ఆవేదనతో
నేడు వేడెక్కుతోంది
స్వతంత్ర భారతావని!!

అన్నంపెట్టని ఆవేశాలు,
అంతకంతకు పెరుగుతున్నాయి-
పుంతలు త్రొక్కే అవినీతి
మర్రిచెట్టు ఊడలా,
దశ, దిశలా వ్యాపించి
దేహంలాంటి దేశాన్ని
జీవచ్ఛవం చేస్తుంది!!

కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
సాగర్
మీ విశ్లేషణ కవితా రూపం లో బావుంది
అభినందనలు