*నవ్వు!*:- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 11.
 నవ్వంటే ఓ దంతప్రదర్శనా!
అది ఓస్వచ్ఛహృదయదర్శనం!
 పెల్లుబికిన ఆనందసందర్శనం!
సహృదయ ఆత్మీయ బంధనం!
12..
  మనషికొక్కడికే దైవదత్తం!
   అన్యప్రాణికోటికి దుర్లభం!
   జగమంతా హాసమయం!
  జీవితమంతా రసమయం!
13..
     నవ్వలేని స్థితి!
     "కోమా" పరిస్థితి!
     నవ్వగలిగే స్ధాయి,
    భువిని దివిజేంద్ర స్థాయి!
14.
    వైషమ్యాలు తుంచేది,
     విభేదాలు తెంచేది,
     సిరులు పంచేది,
      శాంతి పెంచేది!
 15.
      సుఖజీవనానికి "రూటు",
      నవ్వు నాల్గింటికి చోటు,
      సంతృప్తి, సాఫల్యం,
       సహనం, సౌఖ్యం!
        (కొనసాగింపు)

కామెంట్‌లు