పసిడి వన్నెల చిలుక (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

పసిడి వర్ణము చిలుక
పదిలముగావచ్చింది
రామా అని పిలిచింది
చిన్న పలుకు పలికింది !!

చిలుక పలుకు విన్నాడు
శ్రీరామచంద్రుడు
చిన్నగా నవ్వాడు
రా రమ్మని పిలిచాడు !!

రెక్కలు విప్పి లేసింది
రాముని మీద వాలింది
రత్నాల హారం వేసింది
పండ్లు ఫలాలు ఇచ్చింది !!

సీతమ్మ తల్లి చూసింది
మెల్లిగా చిలుకను పిలిచింది
సీత వద్దకు చేరింది
సీతా ఫలము ఇచ్చింది !!

రామ లక్ష్మణులకు మొక్కింది
రాముడు చూసి మురిసాడు
రామచిలుక అని పిలిచాడు
చిలుకకు పేరు పెట్టాడు !!

కామెంట్‌లు