నిత్య చైతన్యము -సాధనలో విజయము
ఆశతో అడుగులు -వికసించే పుష్పాలు
సన్మార్గము శ్రద్ధతో మల్లెలై వెలుగును
అనుభవ పాఠము బంగారు జీవితం
::నిత్య::
వడ్డించినిస్తరి -కాదురా జీవితం
మనసులో చెలరేగే -ఆవేదనా దొంతరా
చిరు చెమటల చిత్తడిలో ఆలోచన చేయరా
హృదయ ఘోష గమనించి- ముందుకే వెళ్లారా
:: నిత్య::
కలిమిలేములున్న -అధైర్య పడకురా
కష్టసుఖాలున్నా -కలత చెందబో కుర
శ్రమ ఒత్తిడులున్న -సహనంతో ముందుకెళ్ళు
ముళ్ళ బాట నైనా- చేదించి నడవరా
:: నిత్య::
అద్భుత శక్తితో -అవతరించి నడవరా
ఆవేశం ఆశయంతో -తొలి అడుగే వేయరా
సమర్థతతో ముందుకెళ్ళు- సాధించు విజయాలు
అగ్రగామిగా నిలిచి -అద్భుతాలు చేయరా
:: నిత్య::
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి