ఏనుగుల సంగతులు కొన్ని....: -- యామిజాల జగదీశ్


 ఏనుగుల గురించి కొన్ని విషయాలు....అందరికీ తెలిసినవే కావచ్చు. నాకైతే ఒకటి రెండే తెలుసు. తెలుసుకున్న మరికొన్ని సంగతులను నాకోసం నేను గుర్తుంచుకోవడానికి రాసుకున్నవే ఇవి. ఇలాటివి రాసి పంపితే ఏ పత్రికా ప్రచురించదు. జుకర్ బర్గ్ అయితే అడ్డుపెట్టక దీన్ని పోస్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. అందుకే అతనికి ధన్యవాదాలు చెబుతూ విషయానికొస్తున్నా...
తమిళంలో చిన్నతంబి అనే సినిమా వచ్చిన తర్వాత ఏనుగులపై తెలుసుకోవాలనే ఆరాటం కలిగింది.
జంతువుల జగత్తులో భారీ ప్రాణి ఏనుగు. దీని జీవితకాలం సరాసరి డెబ్బయ్ ఏళ్ళు.
సింహ బలానికి సాటియైనదే ఈ ఏనుగు. అంతేకాదు, సింహం, పులి వంటివాటిని దగ్గరకు రానివ్వదు. 
 పలు సింహాలు కలిసి ఒక ఏనుగుని చంపవచ్చు. కానీ అటువంటి సంఘటన బహు అరుదు. మిగిలిన జంతువులకు అది సాధ్యం కాదు.
రోజులో పదహారు గంటలపాటు తన ఆహారంకోసం సమయాన్ని ఖర్చు చేస్తుంది.
ఎదిగిన ఏనుగు రోజుకు సుమారు 140 నుంచి 270 కిలోల వరకూ తింటుంది.
ఏనుగులలో మూడు జాతులు ప్రధానం. అవి‌, ఆఫ్రికా ఏనుగులు. ఇవి రెండు రకాలు. ఒకటేమో మామూలు పచ్చిక బయళ్ళలో తిరిగేవి. మరొకటి ఆఫ్రికా అడవులలో సంచరించేవి. రెండూ వేర్వేరు. ఇక మూడవది ఆసియా ఏనుగులు.
ఆఫ్రికా ఏనుగులు ఆసియా ఏనుగులకన్నా భారీవి. ఆఫ్రికా ఏనుగుల చెవులు బాగా వెడల్పయినవి. మగ, ఆడ ఏనుగులకు దంతాలు దాదాపు ఒకేలా పరిమాణంలో ఉంటాయి. ఆసియా ఏనుగుల విషయానికొస్తే మగవాటికి దంతాలుంటాయి. ఆడవాటికి ఉండవు. ఎక్కడైనా ఒకటీ అర ఆసియా ఆడ ఏనుగులకు దంతాలుంటాయి. అవి బహు అరుదు.
ఏనుగులలో ముందర కాళ్ళల్లో నాలుగు నుంచి అయిదు గోళ్ళుంటాయి. వెనుక కాళ్ళల్లో మూడు గోళ్ళుంటాయి.
 
మగ ఏనుగులు దాదాపుగా మూడు మీటర్ల ఎత్తు, ఆరు వేల కిలోల బరువుంటాయి.
ఏనుగుల చర్మం సుమారు మూడు సెంటీ మీటర్ల మందం.
భారీ శరీరమైనప్పటికీ ఏనుగులు పర్వత శ్రేణులపై సులభంగా నడవగలవు.
 
ఏనుగు తొండం ఎంతో విశేషమైనది. మొత్తం నలభై వేల....... ఉంటాయి. ఈ కరణంగానే అవి భారీ చెట్ల కొమ్మలను విరగ్గొట్టగలవు. అలాగే బరువులనూ తొండంతో ఎత్తగలవు.
ఆహారాన్ని తినడానికి నీరు తాగడానికి ఏనుగు తొండాన్నే ఉపయోగిస్తుంది 
 
దంతాలంటే పళ్ళు. ఏనుగు దంతాలు పది అడుగులవరకూ పెరుగుతాయి.
ప్రకృతిలో ఏనుగు సృష్టి అపూర్వమన్నాడు బ్రిటీష్ కవి జాన్ టోన్. 
ఏనుగు పుట్టేటప్పుడు సరాసరి 200 పౌండ్ల బరువుంటుంది. ఇది ముప్పై మంది పుట్టిన పిల్లల బరువుకు సమానం.
 
ఏనుగు కంటికి రెప్పలుంటాయి.
ఏనుగులకు తేనెటీగలంటే గిట్టవు.
ఏనుగు గర్భధారణ కాలం 22 నెలలు.
ఏనుగు దంతం ఒకసారి విరిగితే మళ్ళీ పెరగడమంటూ ఉండదు.
సాధారణంగా మనుషులలో కుడిచేయి అలవాటున్న వారే అధికశాతం మంది. ఎడమచేతి అలవాటున్న వారు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఇలాగే ఏనుగుల్లోనూ ఓ అలవాటుంది. అదేంటంటే ఏనుగు ఎక్కువగా ఏవైపు దంతాన్ని ఉపయోగిస్తాయో దానినిబట్టి అది ఏ వాటమో చెప్పవచ్చు.
 
ప్రపంచవ్యాప్తంగా తీసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో 4,15,000 ఆఫ్రికా ఏనుగులు, 40 నుంచి 50వేల వరకూ ఆసియా ఏనుగులూ ఉన్నాయి.
మన దేశంలో రమారమి లక్ష ఏనుగులు ఉన్నట్టు లెక్కలు తీసినప్పటికి ప్రస్తుతం నలభై వేల వరకే ఉన్నట్టు అటవీ శాఖ వారి అభిప్రాయం. క్రమంగా తగ్గిపోతున్న ఏనుగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వాటి పరిరక్షణకోసం కొన్ని చర్యలు చేపట్టింది.
ఆసియా ఏనుగులవంటివి కేవలం పదమూడు దేశాల్లోనే ఉన్నాయట. అయితే ఒక్క భారతదేశంలోనే యాభై శాతం ఆసియా ఏనుగులుండటం గమనార్హం. వాటిలో సగానికిపైగా తమిళనాడు, కర్నాటక, కేరళలలో ఉన్నాయి. పైగా నీలగిరిలో ఆసియా ఏనుగుల సంఖ్య అధికం. తమిళనాడులో కోయంబత్తూరు, సత్యమంగళం, నీలగిరిలోనూ, కేరళలో మన్నార్కాడు, వయనాడు, ఒకటి రెండు లోయలలోనూ ఏనుగుల సంఖ్య ఎక్కువే. కర్నాటకలో బందిపూర్, నాగర్ హోలే, కొల్లెగాళ్ తదితర ప్రాంతాలలో ఏనుగలెక్కువ.
ఏనుగులు ఒంటరిగా  ఉండవు.గుంపులు గుంపులుగా ఉంటాయి. దేశంలోని ముప్పై వేల ఏనుగులలో మగ ఏనుగుల సంఖ్య కేవలం 1500 మాత్రమేనట.
ఏనుగులు ఏజంతువులనూ వేటాడవు. ఐవి తమలో తాము మాట్లాడుకోగల శక్తి కలవి.
జబ్బు లేని ఏనుగులు అనారోగ్యంతో బాధ పడే ఏనుగులను ఓదారుస్తాయి. వాటికి ఆహారంకూడా తీసుకొచ్చి పెడతాయి.
ఏనుగుల దంతాల బరువు సుమరు అయిదు కిలోలు.
అయిదు కిలోమీటర్ల దూరాన ఉన్న నీటిని దాని వాసనతో పసికడతాయి ఏనుగులు.
ఏనుగు తన తొండంతో ఏడున్నర లీటర్ల నీటిని ఒక్కసారే తీసుకుని తాగగలవు. ఒక ఏనుగు రోజుకు 350 లీటర్ల నీటిని తాగుతాయి.
ఏనుగులు అరవై మాటల వరకూ అర్థం చేసుకోగలవు.
ఏనుగులలో ఆడ ఏనుగులకు మదమెక్కవు.
ఏనుగు దంతాలు రెండూ ఒకేలా ఉండవు.
ఏనుగులు నాలుగు సంవత్సరాలకొకసారి పిల్లలను కంటుంది. ఒక్కొక్కప్పుడు ఒకే కాన్పులో రెండు పిల్లలను కంటాయి.
కేరళలో ఏనుగులకంటూ ప్రత్యేకిం
చి ఓ ఆస్పత్రి ఉంది.
ఆఫ్రికా ఏనుగుల చెవులు ఆసియా ఏనుగుల చెవులకన్నా మూడు రెట్లు పెద్దవి.
ఆసియా ఏనుగులు పదకొండు అడుగుల ఎత్తుకలవి. ఆఫ్రికా ఏనుగుల ఎత్తు పదమూడు అడుగులు.
తమిళంలో ఏనుగుకు ఉన్న పేర్లు....
యానై (నలుపు), వేయం, కళిరు, కశపం,  మాతంగం, కయ్యమ్మా ఉంబర్, ఉంబల్, అంజనావతి, అరసువా, అల్లియన్, అరుపడై, ఆంబల్, ఆనై, ఇబం, ఇరతి, కుంజరం, ఇరుళ్, తుంబు, వల్విళంగు, తూంగళ్, తోల్, కరయడి, ఎరుంబి, పెరుమా, వారణం, పూట్కై, ఒరుత్తళ్, ఓంగల్, నాగ, పొంగడి, కుంబి, తుంబి, నాల్వాయ్, కరేణు, ఉవా, కరి, కళ్వన్, కయం, సింధూరం, వయమా, పుగర్ముగం, దంతి, మదావళం, దంతావళం, కయ్యమ్మలై, వయువై, మందమా, మరుణమా, మదగయం, బోదగం, విరమలి, మదోర్కడం, కటకం, పిడి, అదవై, వడవై, కరణి, అత్తిణి, తుడియడి.
ఏనుగును వివిధ రకాలుగా పూజిస్తారు. 
ఇవి పూర్తిగా శాకాహారులు. తెలివైనవి.
ఆఫ్రికా ఖండంలో 37 దేశాలలో ఏనుగులు విస్తరించి ఉన్నాయి. వీటి శరీరంపై వెంట్రు కలు, ఆసియా ఏనుగుల కంటే తక్కువగా ఉంటాయి.
శ్రీలంక ఏనుగు ఆసియా ఏనుగులన్నింటి లోను పెద్దది. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంచుమించు 3,000-4,500 వరకు ఉన్నాయని అంచనా. ఇవి సుమారు 5,400 కి.గ్రా. బరువుండి 3.4 మీ. ఎత్తుంటాయి.
హిందూ దేవుడు వినాయకుడి తలను ఖండించిన శివుడు ఏనుగు తలను తీసుకొచ్చి అతికించినట్టుగా పురాణాల వచనం.
గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు.
క్షీరసాగర మథనంలో పుట్టిన ఐరావతం అనే తెల్లని ఏనుగు, ఇంద్రుని వాహనం.
ప్రతి ఏటా ఆగస్టు 12వ తేదీన ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
తెలుగులో ఏనుగుని కరి, గజము, దంతి,
హస్తి అని కూడా అంటారు.
ఇక ఏనుగుకున్న పర్యాయపదాలను జి.ఎన్.రెడ్డిగారి పర్యాయపద నిఘంటువులో చూశాను. అవేంటో చూడండి....  అనూపము, అనేకపము, అసురము, ఇభము, ఉద్వాంతము, ఎక్కుడుమెకము, ఏనిక, కంజరము, కంబువు, కట, కపి, కరటి, కరి, కరేణువు, కాళింగము, కుంజరము, కుంభి, కూచము, కేలుమెకము, గంభీరవేధి, గజము, గబ్బుచెంకమెకము, గర్జరము, గౌరు, చందిరము, చదిరము, చేగలమెకము, జర్తువు, త్రిప్రసృతము, దంతావళము, దంతి, దాన, దీర్ఘమారుతము, ద్రుమారి, ద్విపము, 

కామెంట్‌లు
Shyam Kumar. నిజామాబాద్ చెప్పారు…
Excellent information