*వనమహోత్సవం-విశ్వవికాసం*(రాజశ్రీ"కవితా ప్రక్రియలో)(ఆరవభాగము):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 21)
సురలంతా ఆలోచన జేసిరి
ఔషధమును తుదకు తయారుజేసిరి
మేడిపండ్లు నలిపితెచ్చి గోళ్ళకుగట్టిరి
మితిమీరిన హరిబాధను ఉడిపిరి!
(ఉడిపిరి=పోగొట్టిరి)
22)
తెలుగు పద్యానికి మొదటిపుష్పములు
సరిగజూడ చంపక ఉత్పలములు
శార్దూలము మత్తేభము గమనము
సంకేతము కూర్చిరి నవనము!
(నవనము=స్తుతి, స్తోత్రము)
23)
సరస సంగీత స్వరములు
ఏడుఅని సృజించిరి సులువులు
వన్య జీవధ్వనులే సంగీతము
పరమానందము చెందును మనము!
(సులువులు=సులభములు.,మనము=మనసు)
24)
వనమయూరి ధ్వని షడ్జమమాయె
వృషభ నాదమె రిషభమాయె
శృతి పంచమమే వసంతకోయిల
శోభస్కరమౌ వినగా వీనుల!
(సశేషము)

కామెంట్‌లు