జీవన గమనంలో లో ఎదురయ్యే సమస్యలతో
హృదయమెంత భారం మన హృదయం ఎంత భారం
గుప్పెడు గుండెల్లో మోయలేని కోరికలతో
హృదయం ఎంత భారం మన హృదయం ఎంత భారం
:: జీవన ::
కలలన్ని కళ్ళలై కనులముందు నడి ఆడితే
వెతలతో వేసారి కాకా వికలముఐతే
కలతల ఉధృతి మనసును నిర్వీర్యం చేస్తే
ఆలోచన సాలెగూడు సమస్యలు నలుగుతుంటే
::జీవన ::
ఆత్మీయులు స్నేహితుల బంధాల దూరమైతే
అమ్మానాన్నల ఆధారణ కరువైతే
యాసిడ్ దాడులు అడుగడుగున కనబడితే
కట్నం పేరుతో హత్యలు జరుగుతుంటే
::జీవన ::
అభిమానం ఫలితమే అవమానం అవుతుంటే
త్యాగానికి ఫలితం ఆవేదన అవుతుంటే
గుండెల్లో జ్వాలలు ఎగిసెగిసి పడుతుంటే
పిడికెడంత హృదయంలో మోయలేని భారం
::జీవన:
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి