మారాలి ప్రజాతీర్పులు:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

నాడు ప్రజలే పిల్లలు నేడు పిల్లలే ప్రజలు
ఆశలహామీలు కురిపిస్తాం అందళమెక్కేస్తాం
ఎదిగారు నాయకులు మారాలి ప్రజాతీర్పులు

పచ్చనోటుతో కళ్ళు బైర్లు కమ్మీ 
బ్రాందీవిస్కీ మైకంలో తేలిపోతుంటే
వాగ్ధానాల ధాటికి కోటీశ్వరుడైనట్లు కలోచ్చింది.

మత్తులో మీటలు గుర్తులు కనబడక
గొర్రెలా మోసమే మరి నీకు
లంచాల వంచనకు గురి కాకు

ఓటుకోసం ఒంగి ఒంగి దండాలు పెట్టు
ఐదేండ్లు చెప్పులరిగినా చిక్కడు దొరకడు
స్వార్థపు కోరల మహా నాయకుడు

కుటిల ప్రేమలో పడక కన్నబిడ్డల్లా
భావించే నాయకునికి పట్టం కట్టు
ప్రజాస్వామ్య పరిరక్షణ చేపట్టు

అవినీతి అధర్మపాలనకు స్వస్థి పలుకుదం
ఓటుకు నోటు విధానాన్ని ఖండిద్దాం
నీతి నిజాయితీ పునాదులేద్దాం.

బంధుప్రీతి బంధాలకు అతీతంగా
కులమతాల కుటిల తత్వానికి దూరంగా
ఉచిత విద్యావైద్య అందరి సౌకర్యo
నిరుద్యోగ సమస్యల పరిస్కారం
ఆశించి ఓటేద్దాం ప్రజలారా..!

సోమరులను చేసే ఉచితాలు కాదని
ఉపాధి చూపే పాలకులనెన్నుకుందాం

కామెంట్‌లు