మనమంతా భారతీయులం
మరచి పోనీ ధరణి బిడ్డలం
మంచి పెంచే అవని పిల్లలం
మమతలు పంచే స్నేహశీలురం
మహామహుల ఆదర్శాలు
మణులు నింపే రాచబాటలు
మహోన్నతమై చూపు ఆదర్శం
మహిన నిలుపు ఘనలక్ష్యం
మతములన్నీ తోసివేద్దాం
మర్మమెరుగి మసలుకుందాం
మనిషి మనిషిగ సాయపడుము
మరువబోకు పుణ్యభూమి రుణము
మహాత్ముల బాటనడువు
మచ్చలేని మనిషోలె ఎదుగు
మది ఆనంద నిలయమై నిలుచును
మరులు పూసి మనసు దోచును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి