శుభాకాంక్షలు. :- డా ప్రతాప్ కౌటిళ్యా
మనం ఊహలా ఉండాలి 
మన చుట్టూ నిజాలు ఉండాలి 
నిద్ర కలలా ఉండాలి 
స్పృహ జ్ఞాపకంలా ఉండాలి. 

ప్రాణం రేణువుల ఉండాలి 
మనం పర్వతంలా ఉండాలి. 
ఆశ బిందువులా ఉండాలి 
మనం సముద్రం లా ఉండాలి. 

తల విత్తులా ఉండాలి 
ఆలోచనలు అడవి లా ఉండాలి 
గౌరవం గోపురం లా ఉండాలి 
అహంకారం ఆలయంలా ఉండాలి

మేఘం చేపలా ఉండాలి 
రాగం కన్నీరులా ఉండాలి 
ఉదయం దయలా ఉండాలి 
సంధ్య విశ్వాసంలా ఉండాలి 

ప్రేమ వెన్నలా ఉండాలి 
ప్రేయసి వెన్నెలలా ఉండాలి.
మనసు మాయలా ఉండాలి 
మనం ఆకాశంలా ఉండాలి.

మనం వేణు లా ఉండాలి 
ఊపిరి గానంలా ఉండాలి 
వధువు ప్రణవిలా ఉండాలి!
వరుడు అభినవ్ లా ఉండాలి.!!

అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారి కుమారుడు
అభినవ్ ప్రణవి కి పెళ్లి శుభాకాంక్షలు.
05-03-2026

డా ప్రతాప్ కౌటిళ్యా

కామెంట్‌లు