కంద పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 కం.
పిల్లలు పెద్దలమాటల
నెల్లము వినరంటుజెప్పు నేర్పరులుండన్
మెల్లగ మర్యాదలనే
చల్లగ మరిచేరు కుజన సంస్కృతి వలనన్
కం.
గురువుల దూషణ మేలని
పరిపరి బోధించునట్టి పండితులు న్నన్
తరువులు కూలిన విధముగ
గురు బోధలు కూలు నిజము గుట్టుగ మనసా
కం.
మరువక వినెదరు మంచిని
కరిగించగ పసి వయసున ఘనమగు విద్యన్
శరవేగంబున కనెదము
పరుగిడెడశ్వముల వోలె పసి హృదయంబుల్

కామెంట్‌లు