పరీక్షలు:-బెజుగం శ్రీజ--ట్రిపుల్ ఐటి బాసరగుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371.

 1 *ఆటవెలది*
పుస్తకాలుచదివి బుద్ధిగాను పరీక్ష
వ్రాయుచుండగలరు-లక్షణముగ
మంచిమార్కులెల్ల మనకువచ్చినగాని
మెప్పుపొందగలరు గొప్పగాను
2 *ఆటవెలది*
పట్టుబట్టిచదివ  ఫలితాలు దరిజేరు
అమ్మ నాన్న మెప్పు నందుకొనుము
సాధనెంతొజేయ సమకూరుపనులెన్నొ
చదువు మాన వలదు ఛాత్రులార
3 *ఆటవెలది*
పుస్తకాలనన్ని పూర్తిగా చదివేసి
సిద్ధమౌదురెపుడు క్షేమమెరిగి
హాలుటికెటుపట్టి హాళ్లోకి యేతెంచి
వ్రాయునాపరీక్ష వారలంత
4 *తేటగీతి*
పుస్తకాలనుచదువుచు మస్తకమున
గుర్తుపెట్టుకోవలయును గొప్పగాను
శ్రద్ధతోపరీక్షలువ్రాయ  సంతసమున
ప్రథమ శ్రేణియే వచ్చునుబాలలకును.

కామెంట్‌లు