*సామాజిక సమరసతా*:-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371

 దళిత జాతి జనుల దయతోడ కాపాడి
చేరదీయవలెను భారమనక
భవితలోవారికి బాగుగాహక్కులన్
కల్పించవలెనండి ఘనముగాను
కులవివక్షతవీడి  కోరియుస్నేహంబు
జేయాలియందరు శీఘ్రముగను
పాఠశాలల్లోన బాగుగానందర్ని
సమముగాజూడాలి సౌఖ్యముగను
పేదధనికయని బేధాల్నివీడియు
కలసియుండవలెను చెలిమితోడ
సంసారజలధిలో సాగుతుముందుకు
లక్ష్యాలుజేరాలి రమ్యముగను
*ఆటవెలది*
కులముమతమువద్దు కలిసియుబ్రతకాలి
వాదులాడబోకు వైరితోడ
అవనిలోననెప్పుడాపదలొచ్చిన
కలసితీర్చవలెను కష్టములను

కామెంట్‌లు