కాలానికో కాళోజీ ఉదయించాలి:---కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్యపర్యవేక్షకుడు,చిట్యాల,నల్గొండ,9542236764
తెలంగాణ సాహిత్య మాగాణిలో 
విరిసిన ఉద్యమ గులాబీ కాళోజీ
విద్యార్థి దశ రగిలించిన విప్లవ స్పృహ 
ఎగసిపడే ఉద్యమ కెరటం అతని కలం 
అక్షరజ్యోతిగ వెల్గిన జ్ఞానజ్యోతి స్వరూపం 

నిజాం నిరంకుశ గుండెల్లో అంకుశం
ఖండించెను రజాకార్ల వికృత ఉన్మాదం 
తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఘనుడు
భాషకు మకుటం తొడిగి యాసకు ప్రాణం పోసి
నిరాడంబర యోగి తెలంగాణ వైతాళికుడు

పలుకుబడుల పదాలకు పీఠమేసిన వైనం  
తెలంగాణ పోరు జోరు చైతన్య సమాహారం
ప్రజల గొడవ తన గొడవగా తలచిన నైజం 
కోట్లాది గుండెల్లో కొలువైన ధిక్కార స్వరం
సామాన్యుడే దైవమనే విశాల హృదయం  

అన్యాయం అడ్డంకి నెదురించే ఉత్తుంగ తరంగం
అసమానత సహించని మానవతా దృక్పథం
పద్మ విభూషణ్ అందుకున్న తెలుగు తేజం
అణగారిన బతుకులకండగా నిలిచిన అక్షర తపస్వి
జయహో! నీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం

ఎక్కడ అధికారం పడగలిప్పి బుసకొడుతుందో 
ఎప్పుడు పెత్తనం జడలు విప్పి చిందులేస్తుందో 
కారణజన్ముడు కాలానికో కాళోజీ ఉదయించాలి  
అంతర్ముఖ కుటి


లత్వాల అంతమే నీ పంథమనీ   
కణకణ మండే అక్షర సూర్యుడిగ నిప్పులు చెరగాలి
(9 సెప్టెంబర్ కాళోజీ జయంతి శుభాకాంక్షలతో...)

కామెంట్‌లు
EDUCATION AND EMPOWERMENT చెప్పారు…
మంచి మెరుపుతో రాశారు. అభినందనలు