*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౬ - 96)

 శార్దూలము:
*కాలద్వార కవాటబంధనము దు | ష్కాల ప్రమాణ క్రియా*
*లీలాచాలక చిత్రగుప్త ముఖవ |ల్మీకోగ్ర జిహ్వాద్భుత*
*వ్యాళవ్యాళవిరోధిమృత్యుముఖదంష్ట్రా | నాహార్య వజ్రంబు ది*
*క్చేలాలంకృత నీదు నామ మరయన్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
 నువ్వు నాలుగు దిక్కులను బట్టలు గా వేసుకుంటావు. యముడు ఈ భూలోకములోకి వచ్చి తన దారిలో వచ్చిన వారందరినీ చంపి తనతో తీసుకు వెళ్ళాలి అనుకుంటే ఆ యముడిని ఈ భూమి వైపు రాకుండా ఆపే తాళం నీ పేరు.  చిత్రగుప్తుడు తన నాలుకతో లెక్కలు కడుతుంటే, ఆ లెక్కలను కట్టే నాలుక అనే పామును గరుత్మంతుడు లాగా ఆపగలిగేది నీ పేరు.  మృత్యు దేవత యముడి కోరలు పీకి అవతల పారేయ గలిగేద కూడా నీ పేరే .....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మార్కండేయుని తల్లిదండ్రుల తపస్సుకు మెచ్చి, మీకు ఒక వరం ఇస్తాను, వెలుగులా వెలిగే అల్పాయుష్కుడైన ఒక్క కొడుకు కావాలా లేక కలకాలం వుండే నూర్గురు కొడుకులు కావాలా అంటే వారు ఒక్క కొడుకు చాలు అంటారు. ఆ పుట్టిన కొడుకు, పుట్టిన నాటి నుంచి నీ నామ స్మరణలో వుండి, నిత్యం నీ పూజలోనే వున్నాడు. నీ పూజలో వున్న మార్కండేయుని తనవెంట తీసుకు వెళ్ళడానికి సూర్యపుత్రుడు వస్తే. నేను రాను శివ పూజలో వున్నాను అంటాడు, మార్కండేయుడు. ఈ ధిక్కారాన్ని సహించని హనుమాగ్రజుడైన యముడు, తానే తన కాలపాశంతో వచ్చి, మార్కండేయుని పై వదిలితే, ఆ పాశం నీకు చుట్టు కుంది కదా, పరమశివా.  ఆ ఫలితంగా, మార్కండేయుడు చిరాయుష్షు సంపాదించుకున్నాడు.  ఇంతకంటే నీ నామ మహిమ ఎలా చెప్పగలం. అంతటి మహిమ గల నీ నామాన్ని నేను మరచి పోకుండా వుండేటట్లు నీవే అనుగ్రహించాలి, చెన్నకేశవా! నిన్ను, నిన్నే నమ్మి వున్న వారిని కాలుడు కూడా ఏమీ చేయలేడు కదా హిమశైలాధిపతీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు