గురువు : -కవనశ్రీ చక్రవర్తిడాక్టర్ అడిగొప్పుల సదయ్యవ్యవస్థాపక అధ్యక్షుడుమహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం9963991125

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ!
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః!!

అజ్ఞాన చీకటిని అంతమొందగ జేసి
సుజ్ఞాన వెలుగునకు సుపథమేసెడు వాడు

ఆచరించియు తాను ఆచరింపగజేయు
బోధ చేయుటెకాదు బాధలను తొలగించు

లోకనీతిని నేర్పి ఆకలాపెడువాడు
చీకటిన నీవెంట చిరు దీపమే గురువు

తెలివినిచ్చును గురువు తెరువునిచ్చును గురువు
తెగువనిచ్చును గురువు తేజమిచ్చును గురువు

లోకమున దీపమై శోకమార్చును గురువు
బరువు బాధ్యత గురువు కరువు బాపును గురువు

పుడమి శాంతియె గురువు పుడమి క్రాంతియె గురువు
జగతి ప్రగతియె గురువు జగతి సుగతియె గురువు


కామెంట్‌లు