నేను చూసిన తొలి రూపము
నువ్వే
నేను తలచిన దైవము నువ్వే
చంక నెత్తుకొని చందమామను
చూపిస్తూ
పాలబువ్వ తినిపించింది నువ్వే
నారెండు చేతులు పట్టుకొని
అడుగులు వేయించింది నువ్వే
నాపై అంతులేని ప్రేమను చూపించేది నువ్వే
బడికి వెళ్ళనని ఏడ్చి పారిపోతే
పట్టుకొచ్చి పంపింది నువ్వే
అల్లరి పనులు ఎన్ని చేసినా
నా తండ్రి, నా బంగారమంటూ
ముద్దుచేసింది నువ్వే
మళ్ళీ జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా...
మా అమ్మవు నువ్వే....
అమ్మ పాదాలకు వందనం
ప్రేమతో ప్రతి తల్లికీ
ఆది గురువు అమ్మ;--- యన్.భాస్కర్--9వ తరగతి ,ఈ/యం.--జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి