గజ్జల గుర్రం నీరు!?:-ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)

నీళ్లు కళ్ళు తెరిస్తే వానజల్లు
నీళ్లు నోళ్ళు తెరిస్తే వరద పరవళ్ళు
భూమిని వంగి నమస్కరించే ది
భూమిని ముంచేది నీళ్లు!?
భూమికి కళ్ళు నీళ్లు
ఆకాశానికి పసిపాపలు నీళ్లు!?

ఎగిరిన పారిన నీళ్లు సృష్టికే సవాళ్లు
గడ్డకట్టిన దుమికి న గుండెల్లో దద్దరిల్లే నిశ్శబ్ద శబ్ద శిబిరాలు నీళ్లు !?

దాహమేస్తే దహించే ది ఆకలేస్తే కేక లేసేదీ కాదు.
 ఆకాశం నుంచి దిగిన దిగంబర కౌగిలిలో పంచభూతాలు కరిగిపోతాయి 
సప్తసముద్రాలు ఆవిర్భవిస్తాయి!?

రూపం లేని నీళ్లు వళ్ళు లేనీ నీళ్లు గాలి ని మించిన నీళ్లు
గాలిని భూమిపై ఖాళీ చేయించి పైన మాత్రమే బతికించిన గాలి తల్లి నీళ్లు!?
అజ్ఞాతంలో ఉన్న విజేతలు నీళ్లు!?

దేవ కన్యలా దివిలో తిరిగే నెమళ్లు నీళ్లు
భూమి పైకి దిగి భూగర్భం దర్శించిన ఏకైక విజేత నీరు?!

దాచుకునేందుకు భూమికి చేతకాక భూమిని దాచుకున్న పడుచు పిల్ల నీళ్లు!?
మట్టిలో చేరి మంచినీరు చేసి ఉప్పు వేరు చేసి సముద్రాన్ని చేసిన సాహస వనిత నీరు!!?

భూ శంఖంలో పోసిన నీరు తీర్థం అయితే పారే నది తీర్థయాత్ర అయ్యింది!?

అందమైన నీరు ఆడపిల్లే
బృందావనమే మేఘము
రెక్కల గుర్రం సముద్రం!?

పదవే పల్లెకు పదవే పట్నానికి కాదు పదవి ఉన్నా లేకున్నా
మదిని దోచిన ఏ చోట అయినా పారుతుంది పరుగెడుతుంది ఆడుతుంది
గజ్జల గుర్రం నీరు!?

Pratapkoutilya lecturer in Bio-Chem
8409529273, palem
కామెంట్‌లు