అన్నీ మనమంచికేఒక్కోసారి అనుకున్నదొకటిజరిగేది మరొకటిఇంట్లోనే కడప ముందుపట్టా మీద కాలు పడిజర్రున జారిందిపాదం మడత పడ్డదిఓ అంటూ అరుపుపక్కనే ఉన్న భర్తవురుకొచ్చుడుఏం జరిగింది అనే లోపేకింద లేవలేక ఉన్న నన్ను చూసిబిత్తరపోవుడుఅబ్బ నొప్పి నొప్పికెవ్వు కేకలేవలేనుమెల్లగా లేపిండుఅట్లనే ఒంటి కాలు మోపిఇంకో కాలు బాధగానా తోడుకు ఏమైందిబెదరిపోయిందినా మీదనే పడింది పనిఒక కాలు వాచిపోయిందితక్కువయితదిలే అనుకుంటేనొప్పి ఎక్కువై వాపు పెరిగిందిమెడికేర్ లో వెంకటేశ్వర రెడ్డిచూసుడు చిట్టి రాసుడుఎక్సరే తీసుడునల్ల షీట్ లో తెల్లగా మెరుస్తూఎడమ పక్క బొక్క విరిగిందని చెప్పుడుసిమెంట్ పట్టి ఎదురుచూపులునన్ను చుడుతరు అనుకొని సంబరంతెల్లని పట్టి మీద నీలం బట్ట చుట్టుడువైద్యుడు మూడు వారాలు కదిలిచ్చద్దు అని చెప్పుడుతిరిగే కాలుకు విశ్రాంతినడకకు శాంతినాతోడు నీడ అన్నీ ఆయనేదగ్గరుండి చూసుకొనుడువంట తంటా అంతానాది ఒంటి కాలు పోరాటంఆయనది ఒంటరి పోరాటంనా చేతులకునా చేతలకు విశ్రాంతిఎన్నెనో కార్యక్రమాలుమూగపోయి బాధగావింతగా చూస్తున్నాయిస్నేహితులు లేడి పిల్లలగా గంతులేసి తిరుగుతరుఇప్పుడు ఇట్లా అని బాధపడుడునాకు కొంత ఊరటనా వెనుక కొంత బలగం ఉందిఓదార్పు నిచ్చేంతఅదే నాకు మనసు తేలికైన వింతతొలగును చింత!!విధిరాత తప్పదు ఏరికైనామనం ఎంత గొప్పవాళ్లనుకున్నాకర్మ బలీయం అనుభవించాల్సిందే తప్పదుకాలానికి తల వంచాల్సిందేకాలుకే విశ్రాంతి కానీమనసుకు కాదు కదాఆలోచనలు అనంతంఏది ఎప్పుడు ఎట్లా జరుగునోజరగక మానదుఅనుభవించడమే మనిషి నైజం!!కాలికి గాయంవేగానికి కళ్లెం!!--------------------
వేగానికి కళ్లెం: - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-విశ్రాంత సహాయాచార్యులు-హైదరాబాద్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి