మా అమెరికా అనుభవాలు ..: -పోణంగి బాల భాస్కర్






 FLORIDA  (ORLANDO) - TOUR - DAY Three
-----------------------------------
2018 ఏప్రిల్ 8వ తేదీ ఆదివారం 9 గంటలకు హోటల్ దగ్గర బయలుదేరి 10 గంటలకు Kennedy Space Center కు చేరుకున్నాము. టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్లేసరికి ఆదివారం కదా, అప్పటికే పిల్లా, పెద్దా చాలా మందే ఉన్నారు.  అందులో భారతీయులు ఐదారు కుటుంబాలవారు కనబడ్డారు. లోపలికి వెళ్ళగానే అక్కడక్కడా Land Marks దగ్గర ఫోటోలు తీసుకున్నాము. 
1.Nature & Technology అనే Exhibition లో జీవ పరిణామక్రమం గురించి ఫోటోలు, మోడల్స్ తో చక్కగా వివరించారు. జంతువుల బొమ్మలతో పాటు వాటి అరుపులను, కూతలను రికార్డు చేసి సందర్భానికి తగ్గట్టు వినబడేవిధంగా ఏర్పాటు చేశారు. 
2.  వివిధ పరిమాణాల్లో, ఆకృతుల్లో రకాల రాకెట్లు అమర్చి ఉన్న "Rocket Garden" చూశాము.  
3.  Heroes & Legends పేరు మీద 3D Show థియేటర్ లోపల అందరికీ కనబడే విధంగా మూడు, నాలుగు ఎత్తుల్లో బాల్కానీల్లాగా కట్టారు.  కుర్చీలు లేవు. నిలబడి చూస్తూ ఉంటే ఆకాశంలో తేలుతూ అంతరిక్షంలోకి వెళ్తున్న అనుభూతి కలిగింది. 
4.  Astronaut Hall of Fame లో వ్యోమగాములు ఫోటోలు, వారి జీవిత విశేషాలు, వారు ప్రయాణించిన రాకెట్లు, సాధించిన విజయాలు, ధరించిన దుస్తులు, ఉపయోగించిన వస్తువులు మొదలైనవి ప్రదర్శించారు. 
5.  Space Shuttle Atlantis: ఇక్కడ కూడా 3D Show చూశాము. ఆ అంతరిక్ష నౌకలో మనం కూడా ప్రయాణించినట్లు అనిపించింది. show చూసి బయటకు వస్తూ ఉంటే అక్కడ రాకెట్ల ఇంజన్లు, ఇతర విడి భాగాలను వాటి వాస్తవ పరిమాణంలో ప్రదర్శించారు. 
6.  Steeper & Lander Faster అనే "జారుడు బల్ల" పై నుంచి కిందకు జారడం చాలా బాగా అనిపించింది.  అది చాలా steep గా ఉంది. అయినా ఎవరికీ చెప్పకుండా రెండోసారి కూడా వెళ్లి జారాను. 
7.  Twin Sonil Booms అనే ఒక ప్రదేశంలో కాలు పెట్టగానే ఢాం -ఢాం అంటూ రెండు సార్లు భయంకరమైన ప్రేలుడు శబ్దాలు మనల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. 
8.  ఒక పెద్ద హాలులో పైన వంకర టింకరగా అమర్చిన గాజు గొట్టంలోకి దూరి  బయటకు రావడం పిల్లలను బాగా ఉత్సాహపరిచింది. ఇది space ship లోకి దూరుతున్న అనుభూతిని కలిగిస్తుంది. 
9.  Shuttle Launch Experience:  వయస్సు, ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అక్కడ వ్రాసిన హెచ్చరిక చూసి భయపడి మేము ఆ రైడ్ కి వెళ్ళలేదు. 
10.  Journey తో Space 3D Film in IMAX -2 థియేటర్ లో చూశాము.  నిజంగా మనం కూడా వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్తున్నట్లే అనిపించింది.  వారు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు? ఏమి తింటారు? ఎలా నిద్రపోతారు? వంటి నిత్యకృత్యాలతో పాటు, వివిధ వైజ్ఞానిక విషయాలను వివరంగా చూపించారు.
11.Science on a Sphere:  గాలిలో వ్రేలాడుతున్న ఒక గోళం వంటి screen మీద నాలుగు వైపుల నుండీ film project చేస్తూ లైవ్ గా ఒక expert వివరిస్తూ  సందర్శకులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు.
12.Universe Theater లో Space Telescopes (James Web & Hubble) గురించి 3D Film చూపిస్తూ stage మీద ఉన్న ఒక expert వాటి గురించి మరింత వివరంగా తెలియజేసారు. 
13.A Beautiful Planet అనే 3D Film మాక్స్-1 థియేటర్ లో Jennifer Lawrence వ్యాఖ్యానంతో వ్యోమగాముల Foot Prints, వారి జీవిత విశేషాలు, భూగోళం గురించి, అంతరిక్షం నుంచి భూమి పైన ఉన్న ఖండాలు, దేశాలు, వివిధ ప్రాంతాలను గుర్తించి అవి పగలు ఎలా కనబడతాయి, రాత్రి ఎలా కనబడతాయి  వంటి విషయాలు ఎంతో ఆసక్తిదాయకంగా చూపించారు. కొన్ని ఆశ్చర్యాన్ని, ఆనందాన్నీ కలిగించాయి.  
ఇలా ఎక్కడికక్కడ అంతరిక్ష విజ్ఞానాన్ని కళ్లకుకట్టినట్లు, మనసుకు హత్తుకునేలా తెలియజేసే అనేక ప్రదర్శనలు, కళా ఖండాలు చూశాము. చిన్నపిల్లలను ఆకర్షించే విధంగా పార్కులు, చిత్ర విచిత్రమైన బొమ్మలూ, అలాగే తినుబండారాల షాపులు కూడా ఉన్నాయి. 
లోపలే ఉన్న ఒక BUS TOUR వెళ్ళడానికి సమయం సరిపోలేదు. Closing Time (7.00 pm) దాకా ఉండి, అక్కడ ఉన్న ఒక మొబైల్ రెస్టారెంట్ లో కాఫీ త్రాగి, ఒక అద్భుతమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని కొంతవరకైనా తెలుసుకుని, ఆనందించగలిగామనే ఒక తృప్తితో బయటకు వచ్చాము. 
అన్నట్లు ఉదయం NASA Space సెంటర్ కి వెళ్లే మార్గంలో ఒక చోట సముద్రం పైన ఒక బ్రిడ్జి కట్టారు. ఓడలు, లాంచీలు, పెద్ద, పెద్ద పడవలు వెళ్లే సమయంలో ఆ బ్రిడ్జి మధ్యలో రెండువైపులా పైకి లేవడం చూసాము.
ఆ సమయంలో రోడ్డు పైనుంచి వాహనాలు వెళ్లకుండా గేటు వేశారు. రోడ్డుకిరువైపులా సముద్ర నీటి మట్టం చాలా పైకి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయితే ఆ నీటికి ప్రవాహం లేదు, కెరటాలు లేవు, ప్రశాంతంగా ఉంది. 
తిరుగు ప్రయాణంలో COCOA BEACH సమీపంలో ఉన్న Flavors of India అనే ఒక రెస్టారెంట్ కు వెళ్ళాము. లోపల Tables ఖాళీ లేవు.  అక్కడ నుంచి సమీపంలోని Punjab Cuisine of India అనే మరో రెస్టారెంట్ కు వెళ్ళాము. లోపల వెయిటర్లు హిందీలో మాట్లాడారు. Vegetarian Items రుచిగా ఉన్నాయి. మా పెద్ద అల్లుడుగారి స్నేహితులు పిల్లలతో సహా మమ్మల్ని చూడడానికి అక్కడికి వచ్చారు. అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, మంచిగా డిన్నర్ చేసి రాత్రి 11 గంటలకు తిరిగి హోటల్ కు చేరుకున్నాము.  
Hotel నుండి వచ్చేటప్పుడు Banana River మధ్యలో నిర్మించిన రోడ్డు పైనుంచి వచ్చాము. ఇక్కడ కూడా నీటి మట్టం పైకే ఉంది. 
మొత్తానికి మూడో రోజు పర్యటన వినోదంతో పాటు విజ్ఞానదాయకంగా గడిచింది. 
రేపు (09-04-2018) సోమవారం Walt Disney World చూడాలి.
🌸🌷🌸






కామెంట్‌లు