మొదటి బహుమతి మరిచిపోలేనిది : కోటయ్య : -- సేకరణ : అచ్యుతుని రాజ్యశ్రీ




 కోటయ్య.గారు ఆర్ట్  డ్రాయింగ్ సార్ గా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల నించి రిటైరయ్యారు. జాబ్ దొరికే దాకా పడిన కష్టాలు ఆ దేవునికే ఎరుక.ప్రస్తుతం నల్గొండలో కొడుకు వద్ద ఉంటున్నారు. ....ఇక్కడ ఇచ్చిన బొమ్మల్లో సీసా లోనిది హెర్కులేస్. అది ఒక wood sculpture. మొదట హెర్కులస్ ను తయారు చేసి, దానిని జాగ్రత్తగా ముక్కలు చేసి, మరల సీసా లో చాలా జాగ్రత్తగా సీసా పగలకుండా హెర్కులస్ రూపం పాడవకుండా అతికించాలి.అదే విధానంగా మిగతా మంచి బొమ్మలను వేశారు. ఇక కోటయ్య సర్ వివరాలకు వెళితే 
 ప్రకాశం జిల్లాకి చెందిన బసవాపురం పల్లెలో పుట్టారు.పెద్ద అన్నయ్య పొలం పనిచేసి వచ్చి ఎద్దులను కట్టేసి బొమ్మలు గీయటం చూసిన  చిన్నారి రాజయ్య కి చిత్రకళ పై ఆసక్తి కలిగింది. అన్నగీసిన కొంగ హర్షవర్ధనుడి బొమ్మలు ఆబాలుడిని ఆకర్షించింది. బడిలో చేరిన మొదటి రోజునే అ నుంచి ఱ వరకు చూడకుండా రాసిచూపి శభాష్ అనిపెంచుకున్నాడు.3వతరగతి లో తన తోటి పిల్లలు  టీచర్స్ చిత్రాలు  వారి పోలికలు వచ్చే ట్టు గీసి అందరి దృష్టి లోపడ్డాడు. టీచర్స్ పకోడీ పొట్లం  గిఫ్ట్ గా ఇవ్వడం మరువలేని కానుక. అప్పుడే 6వక్లాస్ పిల్లలకుఛార్ట్ మోడల్స్  బొమ్మలు గీసి సాయపడినాడు.7వక్లాస్ చదివేటప్పుడు ఎన్. టి.ఆర్.ఎ.ఎన్.ఆర్.మొదలైన సినీతారల చిత్రాలు గీశాడు.డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ రావటం గొప్ప అనుభూతి. నెల్లూరు  లోని మహమదాపుర్ హాస్టల్లో  హైయ్యర్ సెకండరీ స్కూల్లో చేరాడు.అప్పుడే కరువురావటం తండ్రి పక్షవాతం తో మంచానపడటంతో  చదువు ఆపేసి ఇంటికొచ్చి వ్యవసాయ పనుల్లో 14ఏళ్ల రాజయ్య మునిగి పోయాడు. తండ్రి చనిపోటంతో ఆచిన్నారి ధవళేశ్వరం బ్యారేజి  పనులు  ఇతరపనులతో కుటుంబానికి చేయూత అయ్యాడు.అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంట్లో నెలజీతంకి పని చేస్తూ గోడపై చిత్రం గీయటంచూసి యజమాని "బాబూ!నీవు చదువుకో"అని ప్రోత్సహించటంతో అన్నతో ఖరాఖండిగా చెప్పాడు"నేను  చదువుకుంటా"అని.పొదిలి లో1975..1976లో టెన్త్ పాసై ఇంటర్లో చేరినా చిత్రకళ ను మానలేదు.
 మద్రాసు డ్రాయింగ్ పరీక్షకు హాజరై పాసైనాక రాష్ట్రస్థాయి పోటీలో  సెకండ్ ప్రైజు పొందాడు. చుట్టుపక్కల గ్రామాల్లో బొమ్మలు వేసేవాడు.ఎద్దుల చిత్రాలు గీసేవాడు.తన జీవితంలో ఒక అద్భుత ఘట్టం జరిగింది అని వివరించారు. ఆగ్రామంలో దొంగతనం జరిగింది. దొంగ ఎవరో తెలుసుకున్న రాజయ్య  సన్నివేశాలు గోడపై చిత్రించారు. పోలికలతో దొంగ ను పట్టుకున్నారు.అలా తన చేతివృత్తి  సమాజం కి ఉపయోగపడింది అని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. కధ లా అనిపించటంలేదూ?ఇంటర్తో చదువు పూర్తిగా ఆగిపోయింది. సర్వేలు గురు కుల విద్యా లయంలో ఆయనచేసిన విగ్రహాలు  ఇప్పటికీ ఉన్నాయి. మలి జీవితం సన్మానాలు సత్కారాలతో సజావుగానే సాగిపో తోంది అని సంతృప్తిగా అంటాడు ఆకళాకారుడు.కళ దైవదత్తం. శరీర శ్రమ  బుర్ర ఒకేసారి పని చేయాలి. ఆయన కి ధన్యవాదములు. ఇలా ఎంత మంది  కళాకారులు ఉన్నారో?మొలక  వారి బాల్యాన్ని వెలికి తీయటం ముదావహం.పునాది  మనలను ప్రోత్సహించినవారిని  స్మరిద్దాం. శ్రీ వేదాంత సూరిగారి  సూచనలు  ఆయన ప్రేరణ  నాకు అందమైన అనుభూతి.ధన్యవాదములు సర్.....

కామెంట్‌లు
నాగి చెప్పారు…
పేరు రాజయ్య అని పడింది కొన్ని లైన్స్ లో.. చెక్ చేయగలరు
Unknown చెప్పారు…
కళాకారునికి అభినందనలు
💐💐💐💐💐💐💐💐