సీస మాలిక:
కూడబెట్టిన దేది కూడిరాదెప్పుడు
మంచి చెడు లే నీకు మహిలొ నుండు
నాది నీదనుచును వాదంబులాడకు
ఏది నీది ల కాదు యెక్కడైన
ఒరుల నొప్పించక పరుల దూసించక
ధైర్యమున్ననుకాచు దైవ మెపుడు
కలిమి లేదనియిల కలత నీకెందుకు
చెలిమియె మిన్నరా కలిమి కన్న
కోరిన పేదకు భూరిగా సాయమ్ము
చేయవలెనదియె న్యాయమౌను
తన వారు పర వారు యనకుండ ప్రేమతో
మంచి మార్గమునెంచు మనసులోన
ఎంత సంపాదించి నేమి లాభమ్ముర
వెళ్ళిపోయినాడు వెంట రాదు
తే.గీ
తుదకు నీదన్నదే లేక తుడిచి పోయి
కడకు మిగిలేది నీనేల కాటియందె
సత్యమార్గము నడిచిన నిత్య సుఖము
సూచనలు నిచ్చు పెద్దల
సూక్తి వినుము
: ఆ నలుగురు ఎవరు?రచన:జెగ్గారి నిర్మల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి