నానమ్మ కథలతో పెరిగాను :డాక్టర్ లక్కరాజు నిర్మల ; - సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 డాక్టర్ లక్కరాజు నిర్మల . సంఘసేవిక.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి  శ్రీహనుమాన్ వ్యాయామశాల  వైస్ ఛైర్మన్. రచయిత్రి. మానసిక వికలాంగుల పాఠశాల నిర్వహణలో దక్షత చూపారు.వీరు  బాల్యవిశేషాలు అనుభవాలు  మెసేజ్ ద్వారా తెలిపారు.వివరాలు ఆమె మాటలలోనే తెలుసు కుందాం.
నమస్కారం నా చిన్న వయసులో ఎన్నో అద్భుతాలు ప్రతి చిన్న విషయానికి మా అమ్మమ్మ వేమన పద్యాలు సామెతలు సుమతి పద్యాలు అలవోకగా చెప్పేది రామాయణ భారత కథలు రాగయుక్తంగా పాటలు పాడేది కానీ చదువుకోలేదు ఆమెకు తన పేరు కూడా నేర్పించాను అలా చదువు రాక పోయినా మా అమ్మమ్మ ఎంతో గొప్పగా ఒక నాలుగు వాక్యాలతో ప్రతిదానికి ఒక పొడుపుకథలు చెబుతున్నప్పుడు అవన్నీ నా మనసులో పూర్తిగా మిగిలిపోయాయి ఏదైనా ఒక విషయాన్ని నాలుగు నాలుగు లైన్లలో అయితే అవి శాశ్వతంగా ఉంటాయి అన్న ఆలోచన నాకు చిన్న వయసులోనే పడింది మినీ కవితలు రాయడం అలవాటు చేసుకున్నాను నాన్న గారు తెలుగు పండిట్ నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం పుస్తకాలంటే మహా ప్రాణం నాన్నకి.  అలా మా ఇంటి నిండా ఎటు చూసినా పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు పుస్తకాల షాపులో కొత్త పుస్తకం అది మా ఇంట్లో ఉండాల్సిందే మా బాబాయి గారు దగ్గరలో లైబ్రరీ కూడా చేసేవాళ్ళం గాంధీ గారి తో పని చేసిన పల్లెర్ల హనుమంతరావు గారు మా ఇంటి పక్కన ఉండేవారు మేము వారు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళం ఎందుకంటే బేటికి మేము వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఆడపిల్లలు 8వయస్సు వచ్చిన తర్వాత 9 ఏళ్ల లో ఆడ పిల్లలు బయటికి రాకూడదు మా అమ్మ వాళ్ళు  టాంగా లో వెళ్లేవారు వెళ్ళేవాళ్ళు మేము రిక్షాలో వెళ్ళేవాళ్ళం ఆడపిల్లలు బయట తిరగకూడదు షాపులకు వెళ్ళకూడదు అందుకని మా బాబాయి గారి ఇంటికి మా ఇల్లు గాంధీ గారి తో పల్లెర్ల హనుమంతరావు తాతగారు దేశం గురించి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ దేశ భక్తి గీతాలు పాడుతూ జైల్లోకి వెళుతూ పండ్లు పంచుతూ నాటికలు వేస్తూ పిల్లలంతా కలిసి పిల్లలు ఎవరు మా అమ్మ అక్క పిల్లలు ఆరుగురు మేము ఆరుగురం మా పెద్దమ్మ పిల్లలు ఆరుగురు పిన్ని బాబాయ్ ఇంతమంది కలిసి నాటికలు గ్రామాలు పాటలు పాడుతూ ఆటలు ఆడే వాళ్ళు మరియు బొమ్మల పెళ్లిళ్లు చేసేవాళ్ళం తులసి వివాహం చేసే వాళ్ళు శ్రీరాముడు చేసేవాళ్ళు దసరా పండుగ వచ్చిందంటే దసరా పండుగ ఇంటికి వెళ్లి తాంబూలాలు పంచుకునే వాళ్ళు పంచుకునే వాళ్ళం పంచుకునే వాళ్ళం జమ్మి ఆకు పంచే వాళ్ళం
రకరకాల కుట్లు రకరకాల అల్లికలు ట్రయాంగిల్ షేప్ స్క్వేర్ షేప్ చిన్న చిన్న గా కట్ చేసి రంగురంగుల తోరణాలను చేతితో కుట్టే వాళ్ళం మరియు u1 నీతో రుణాలుగా వేసేవాళ్ళం పగిలిన గాజులను తోరణాలుగా చేసి రంగురంగుల గాజులతో వేడి చేసి పగిలిన గాజులను వేడి చేసి ఒకదానితో ఒకటి కలిపి తోరణాలు అనేవాళ్ళం వెంకటేశ్వర స్వామిని అలివేలు మంగ రాజరాజేశ్వరి దేవి వినాయకుడిని చేతితో కుట్టే కరెక్ట్ గా వేసే వాళ్ళం ఇప్పుడు వస్తున్న ఎంబ్రాయిడరీ లాగా చేతితోటి చక్కటి ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళం ఆటలో ఫస్ట్ కుట్లు అల్లికలు ఫస్ట్ చదువులో ఫస్ట్ నా పదవ తరగతి లోనే కవిత్వం రాయడం దానికి మా టెన్త్ క్లాస్ టీచర్ మీద గులాబీ రంగు చీర కట్టుకొని వచ్చిన ఆమె పైన మొదటి కవిత అపురూపమైన అనుభూతి ఇదే కాక ఏడవ తరగతి లో ఫోటోలు దిగే వాళ్ళు పదవ తరగతిలో ఫోటోలు దిగే వాళ్ళం దగ్గర పాత పాలమూరు నుంచి అందరము స్నేహితులమే అటుకులు ఆవకాయ కలుపుకొని క్లాక్ టవర్ క్లాక్ టవర్ దగ్గరికి వెళ్లి ఆ పార్కులో కూర్చొని తిని ఇంటికి వచ్చేవాళ్ళం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆనాటి స్నేహితులమే స్నేహితులమే 30 ఏళ్ల తర్వాత ఈ మధ్య కాలంలోనే మా పాఠశాలకు వెళ్లి మా టీచర్లు మా బడి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసి వచ్చాం అలా ఎన్నో ఆటలు పాటలు రాత్రి 9 గంటలకు హరికథ బుర్రకథ సారంగధర చరిత్ర బ్రహ్మంగారి చరిత్ర నాటకాలు వేసేవారు రాత్రి నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కిటికీ లోనుంచి ఆ కథలను వినేవాళ్ళం మా ఇంట్లో వంద గోవులు వాటి డెలివరీలు వాటికి మా అమ్మమ్మ నేను బాలింతకు బాలింతకు కావలసిన ఇవన్నీ సిరి ఆవులకు పెట్టేవాళ్ళం ఆనాటి అనుభవాలే ఈనాటి కవిత్వము సామాజిక సేవ ప్రోత్సాహము ధైర్యము నియమ నిబద్ధత పనుల యందు ఇవి మా అమ్మమ్మ మా అమ్మ నాన్న తాతయ్య పెద్ద నాన్న లు పెద్దమ్మలు అన్నలు అక్కలు అందరి నుంచి నేర్చుకున్నవే అందరి అందరి నుంచి ఎంతో మనోధైర్యాన్ని ఆ రోజుల్లోనే లభించింది
 ఇకమాకు పల్లీలు మామిడి  మొక్కజొన్న చింత కాయలు మస్తు పండేవి.రోటిలోవేసి చింతకాయలు దంచేవారం.కేజీల కొద్దీ స్వీట్లు  లడ్డు మైసూర్పాక్ జంతికలు వండేవారం.ఇక నూనె లేకుండా ఆవకాయ వేస్తాను.వింతగా ఉందా?100మామిడికాయలు ముక్కలు చేసి పసుపు సున్నం కలిపిన10లీటర్ల నీటిలో తగినంత ఉప్పు కారం ఆవపిండి వేస్తాను.తినేముందు కొద్దిగా నూనె కలిపి తాలింపు వేసి ఆరోజు కి సరిపడా ఆవకాయ ఉరగాయ తింటానికి చేస్తాను.3ఏళ్ల క్రితం ది ఇంకా మాఇంట్లో ఉంది. ఇక మరమరాలు ఇంట్లో నే చేస్తాం.
బియ్యం  నీటితో శుభ్రంగా కడిగి ఉదయం6నించి సాయంత్రం 6దాకా ఎండలోపెట్టాలి.ఉప్పు కలిపి  మర్నాడు బాండీలో కొంచెం కొంచెం పోసి కొత్త పూచికపుల్లల చీపురుతో పొయ్యి పై ఉంచి వేయించాలి.  ఆపైన ఆరబెట్టిన కుండలో15రోజులు ఉంచాలి. బట్టి వేసేవాడికి ముందు రోజు వెళ్లి చెప్పే దాన్ని "రేపు బియ్యం బట్టిలో వేయాలి "అని.ఆమరునాడు బట్టీకి తీసుకుని వెళ్లేదాన్ని.ఇసుకలో వేడిచేస్తాడు.ఒక కె.జి.బియ్యం కి 5కె.జి.లపైగా మురమరాలు తయారవుతాయి.ఇంటికి తెచ్చి జల్లెడ పట్టి డబ్బాలో దాచేవారం.కొబ్బరిముక్కలు  జీలకర్ర కరివేపాకు  పోపువేసి టిఫిన్ గా తినేవారం ఇంటిల్లి పాది.ఇక ఇంటిలో ఆవులుండేవి.వాటికాన్పులు అమ్మమ్మయే చేసేది.పుట్టిన దూడ సంరక్షణ అంతా ఆమెదే.అమ్మమ్మ నాబెస్ట్ ఫ్రెండ్".ఇలా ఎన్నో విషయాలు ఆమె వివరించారు.ఆమె చెప్పుతుంటే నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఆమెకు కృతఙ్ఞతలు. 

కామెంట్‌లు