ఆడపిల్ల (నానీలు) >కవి: డా.కె.ఎల్.వి.ప్రసాద్. >హన్మకొండ .

 ప్రేమపేరుతో 
శృంగారానికి 
అడ్డురాదు లే
తక్కువకులం !
---------------------
కులంపేరుతో
చిన్నచూపు...!
'రేప్'లు,చావులు
ఆనకఆడపిల్లకు!!
------------------------
వయసుతోపనిలేదు
అత్యాచారాలకు...!
కళ్లు మూసుకుపోవు
మృగాళ్లకు ....!!
---------------------------
రక్షణలేని-
బ్రతుకాయెఆమెది!
'ఆమె'కావడమే...
ఆమెపొరపాటా..?
------------------------------
కన్యాశుల్కమూ
కట్నాలశాపాలకు
తోడయిందిలే ....
రక్షణలేని బ్రతుకు..!
--------------------------------
అన్నా-తమ్ముళ్లు 
తలుచుకుంటే చాలు !
అక్కా -చెల్లెళ్ల 
ఆయష్షు పెరిగినట్టే !!
-----------------------------------
          ○○○

కామెంట్‌లు
శ్యామ్ కుమార్ chagal చెప్పారు…
సామూహిక అత్యాచారాలు
అక్కా చెల్లెలు కదా సమిథలు
ఈ రోజుకి వేడి వార్తలు
చేవ లేని చట్టాలు
రేపు మాపు ఎన్కౌంటర్ లు
మళ్లీ జనం వు రుకులుపరుగు లు
చట్టం కళ్లకు గంతలు