."మ" గుణింత గేయం:--- మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలు-జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 మనిషి మనిషిగా బ్రతకాలి
మాటల గారడి మానాలి
మితంగా మాట్లాడాలి
మీగడ పెరుగు తినాలి
ముద్దుగా మీరు యెదగాలి
మూఢత్వం వీడాలి
మృదంగనాదం వినాలి
మౄ అక్షరం పలకాలి
మెదడుకు పదును పెట్టాలి
మేధస్సును  పెంచాలి
మైదానంలో ఆడాలి
మొక్కలు బాగా నాటాలి
మోదము తో పెంచాలి
మౌక్తికములా మెరవాలి
మంచితనము  పంచాలి.

కామెంట్‌లు