మానబా!...అచ్యుతుని రాజ్యశ్రీ

 రెండు వందల ఏళ్ళ క్రితం నాటి సంగతి. సూరత్ నవాబు  ఆప్రాంత నగరశ్రేష్ఠి కూతురు  మానబా ను చూశాడు. ఆకాలపు నవాబులు బాగా డబ్బున్నవారి ఇంటి కెళ్ళి జలగలా పట్టు కుని  వారి నుంచి  కావాల్సినంత డబ్బు పిండి పీల్చి పిప్పిచేసేవారు.నవాబు మానబాను తనకిచ్చివివాహం చేయమని అతనికి పెద్దపదవి ఇస్తానని ఆశపెట్టాడు."నీవు నామాట వినకపోతే బికారిని చేసి జైల్లో పడేస్తాను.నీకూతురిని నాబేగంగా చేసుకుంటా."పాపం!నిస్సహాయుడైన ఆసేఠ్ మానబాను  పల్లకీలో పంపాడు.నవాబు మహల్లోకి ప్రవేశించాలంటే ఎన్నో మెట్లు ఎక్కాలి.మానబా మెట్లు ఎక్కుతూ ఆలోచనలో పడింది. పైమెట్టు దాకా ఎక్కి ఒకసారిగా పైనించి కావాలి అని కిందకి దొర్లసాగింది.తనమాన రక్షణ కై 
ఆనాటి చిన్నారి రాజపుత్ర బాలికలు  సమయోచితంగా వ్యవహరిస్తూ  శత్రువుల కుట్రలను తిప్పి కొట్టేవారు.అలాంటి ధైర్యసాహసాలు త్యాగశీలురైన వనితలు పుట్టిన పుణ్య భూమి. హమారా భారత్ మహాన్!

కామెంట్‌లు