సైకిల్ పాప :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

చిన్న సైకిలెక్కి పాప 
వీధి వీధి తింపె పాప
గణ గణ గంట కొట్టే పాప
చిరునవ్వులు రాల్చే పాప

పోటీలందు నిలిచె పాప
అలవోకగా గెలిచె పాప 
సెలవు రోజున మా పాప 
ఊరంతా నా దనె పాప 

బడికి , గుడికి  పోయే పాప
భక్తితో దేవుని మొక్కె పాప 
ఆసక్తిలు చూపెడి పాప 
మెప్పులు పొందెడి పాప.
కామెంట్‌లు