కాలం మారుతుంది ..!! > చిత్ర కవిత .; -రచన ..> డా.కె.ఎల్.వి.ప్రసాద్>హన్మకొండ..

 ఆటల్లో పెట్టి 
ఆకర్షణల్లోకి నెట్టి 
మాటలతో --
మాయాజాలం చేసి ,
మానవత్వానికి 
చెల్లుచీటీ పలికి ,
మృగత్వం 
బుసకొట్టిన పామై 
కౄరంగా ...
విషం చిమ్ముతుంది 
మగాడినని 
మీసం మెలేస్తుంది !
అన్నెంపున్నెం ఎరుగని 
ఆడపిల్లల బ్రతుకులు ..
కఠినుల కబంధ హస్తాల్లో 
నలిగి నాశనం అవుతున్నాయ్ 
ఆడబిడ్డల్ని కన్నవాళ్లకు 
కన్నీళ్లే మిగులుస్తున్నాయ్ ,
వాళ్ళవేదనలు -ఆవేదనలు 
పాలకులు విసిరినతాయిలాలతో 
నోరుమూయిస్తున్నాయ్ ...!
అతివలసమస్యల పరిష్కారానికి 
అతివలే నడుంబిగించే 
కాలం ఆసన్నమయింది .....!
సహనానికి --
విరామం పలికి .....
వీరనారి కానున్నది మహిళ ..!!

కామెంట్‌లు
మొహమ్మద్. అఫ్సర వలీషా చెప్పారు…
చాలా బాగా వ్రాశారు సార్ ఆ రోజు ఎంతో కాలం లేదు చాలా దగ్గరగా ఉంది హృదయ పూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐👌🙏💐👌🙏💐👌🙏💐