*అపర సరస్వతి సంగీత విధ్వన్మణిఎం. ఎస్. సుబ్బులక్ష్మీఅమ్మ*: శ్రీదేవి రమేష్ లేళ్ళపల్లి



 ఎం.ఎస్.అమ్మ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా దంపతులనుండి తెలుపుతూ పాదాభివందనం చేస్తున్నాము
సాక్షాత్తు సరస్వతి దేవి అంశతో జన్మించిన సంగీత విధ్వత్మణి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ
ఆవిడ నిత్య స్మరణీయురాలుఆవిడని చూడడం నా అదృష్టం, ఆవిడ మధురానుభూతులు గడిపిన  ధామం చూడటం మా దంపతుల అదృష్టం*మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి*
(ఎం.ఎస్.సుబ్బులక్ష్మి)  అమ్మ గారి ఇల్లు చూసిన మధురానుభూతి మీ అందరితో పంచుకుంటాను.
విష్ణు సహస్రనామం  భజగోవిందం
ఒక్కటేంటి ఏ దైవికమైన పాటలు,శ్లోకాలు వినాలన్నా అలాగే కర్ణాటక  సంగీతంలోని ఏ వాగ్గేయకారుల కీర్తనలు వినాలన్నా  ఈ సరస్వతి అంశతో జన్మించిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ గళంలోనే వినాలి అని ప్రపంచంలోని  అందరికి అనిపిస్తుంది కేవలం దైవికంగా పాటలు పాడటమే కాకుండా ఆవిడ మనసు అమ్మ మనసు, గొప్ప మానవత్వం మూర్తీభవించిన దానశీలి అమ్మ
ఆవిడను ప్రత్యక్షంగా చూడలేదని నాకు బాధ ఎప్పుడూ ఉంటుంది.కానీ మొన్న డిసెంబర్ లో  ఒక పెళ్ళికి మధురై వెళ్ళాము.
మా దంపతుల మనసు మాత్రం మదురైలో  సుబ్బులక్ష్మి అమ్మ ఇల్లు చూడాలి అని అనుకున్నాము.మాకు ఆవిడ ఇల్లు కు సంబంధించిన కొంచెం కూడా సమాచారం లేదు. కానీ మాకు ఒక్కటే తెలుసు మీనాక్షి అమ్మవారి గుడికి దగ్గర్లో ఉంటుంది అని.
కానీ మీనాక్షి అమ్మ గుడి ఎంత పెద్దదో మనందరికి తెలుసు. అమ్మవారి దర్శనం చేసుకుని గట్టి సంకల్పంతో గుడి 
బయటికి వచ్చి గుడి చుట్టూ వున్న నాలుగు వీధులు అడుగుతూ వెళ్లాలని నిశ్చయించుకున్నాము నేను మా వారు రమేష్ గారు.
కానీ బాధాకరం ఏమిటంటే ఏ ఒకరికి సుబ్బులక్ష్మి అమ్మ ఇల్లు తెలియకపోవడమే కాకుండా అవిడది ఈ ఊరేనా అని మమ్మల్నే అడిగారు. 
నేను మా వారు ఎంతో బాధ పడ్డాము. కానీ ఏ మాత్రం నిరాశ పడక  సుబ్బులక్ష్మి అమ్మ గారి ఇల్లు చూడందే మేము మధురై దాటి చెన్నై వెళ్లకూడదని గట్టి సంకల్పంతో వెతకడం మొదలు పెట్టాము. అప్పుడే వర్షం మొదలయింది. తడుస్తూ కూడా వెతుకుతూనే ఉన్నాము. 
మా వారికి ఉన్నట్టుండి చిన్నప్పుడు ఆయన చదివిన  ఒక విషయం గుర్తొచ్చింది.ఆవిడ మధురైలో  ఉన్న ఇంటి వీధి పేరు గుర్తొచ్చింది అది  హనుమంతరాయ స్ట్రీట్ , ఇంటి గోడమీద వీణ బొమ్మ ఉంటుంది అన్నట్టు లీలగా. హమ్మయ్య అనుకుని ఆ వీధి పేరు చెప్పి అడిగాము అయినా ఎవ్వరు మాకు తెలియదు అన్నారు. చివరికి ఒక వయసు మీరిన అమ్మగారు వచ్చి మీకు ఎవరి ఇల్లు కావాలి అని అడిగారు.  సుబ్బులక్ష్మి అమ్మ ఇల్లు అని చెప్పాము.
ఆవిడ మమ్మల్ని వెంట తీసుకుని ఆ వీధిలోకి వచ్చి అదిగో ఆ ఇల్లే అని చెప్పి నాకు పని ఉంది మీరు వెళ్ళండి అని వెళ్ళిపోయారు( మా మనసులో ఆ పెద్దావిడ  మీనాక్షి అమ్మ నో,సుబ్బులక్ష్మి అమ్మనో అనుకున్నాము దంపతులం,ఏదైనా చూసే దృష్టిని బట్టి ఉంటుంది)
ఇంకేం కాస్త లోపలికి వెళ్తే గోడమీద వీణ బొమ్మ కనిపించింది. మా దంపతుల ఆనందానికి అవధులే లేవుకింద బెల్ కొట్టాము ఒక ఆవిడ బయటికి వచ్చి ఎవరండి అని తమిళ్ లో అడిగారు. మేము చెప్పాము సుబ్బులక్ష్మి అమ్మ ఇల్లు చూడాలని వచ్చాము అని. సాదరంగా ఆహ్వానించారు మమ్మల్ని. ఒక్కో అడుగు  సుబ్బులక్ష్మి అమ్మ నడిచిన  ఇంట్లో నడుస్తుంటే ఒక అలౌకిక అనుభూతికి లోనయ్యము ఇద్దరంఆవిడ  చాలా చక్కగా మాట్లాడారు మాతో. నేను ఆసక్తిగా మీ పేరు ఏంటమ్మా అని అడిగాను * సుబ్బులక్ష్మి* అన్నారు. ఆశ్చర్యపోయాము. అప్పుడు చెప్పారు మా కుటుంబంలో ఆడపిల్లలకు సుబ్బులక్ష్మి అని పేరు పెట్టుకుంటాము అని. 
అమ్మ ఉన్న గది చూడాలని ఉంది అన్నాము. వెంటనే తీసుకెళ్ళారు.సుబ్బులక్ష్మి అమ్మ ఫోటో కి ఇద్దరం దంపతులం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాము ఆ ఇంటి సుబ్బులక్ష్మి అమ్మ గారు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి తాంబూలం తీసుకుని ఆ ఇంటికి నమస్కారం చేసుకుని దైవికమైన  మధురానుభూతితో  చెన్నై చేరాము
సర్వేజనాః సుఖినోభవంతు
కామెంట్‌లు
తెలుసుకుందామనే చెప్పారు…
ఆసక్తికరంగా ఉంది చివరంటా. మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు మీకు.
తెలుసుకుందామనే చెప్పారు…
ఆసక్తికరంగా ఉంది చివరంటా. మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు మీకు.
లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్ చెప్పారు…
స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు🙏లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్