పడి లేచిన కడలి తరంగం నా బాల్యం.: -శివలెంక నాగ ఉదయలక్ష్మి: - సేకరణ : అచ్యుతుని రాజశ్రీ

 ( శివలెంక నాగ ఉదయలక్ష్మి-పుట్టిన తేది :05-09-1954విద్య : యమ్. ఏ. సోషియా లేజీ: -వృత్తి          :డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్, సూ పె రేండెంట్;తండ్రి పేరు   :డాక్టర్ శివలెంక సదా శివ రావ్--తల్లి పేరు      :శ్రీమతి శివలెంక విజయ వీర లక్ష్మీ: జన్మస్థలం :గుడ్లవల్లేరు: గుడివాడ తాలూకా: కృష్ణా జిల్లా-ఆంధ్రప్రదేశ్)
  మా నాన్న గారు గుడ్లవల్లేరు లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేసేవారు అమ్మ గృహిణి మేము ఆరుగురు పిల్లలం. నా బాల్యం, విద్యాభ్యాసం, అంతా గుడ్లవల్లేరు లో నే గడిచింది, అందరిలో కి నేను చిన్నదాన్ని, ఆఖరి సంతానం. మా నాన్నగారు నన్ను అపురూపం గా చూసే వారు ముఖ్యం గా నాకు ఏ డాది వయస్సు లోనే పోలియో వచ్చి కాళ్ళు రెండూ చచ్చు బడి పోయాయి.. నాతో పాటు మా మూడో అన్నయ్య కి కూడా, మా నాన్న గారి వైద్యం లో మా అన్నయ్య కి నడక వచ్చింది కానీ నాకు మాత్రం రాలేదు మా అమ్మ, నాన్న నాకెన్నో వైద్యా లు, పూజలు చేశా రు నా బాల్యా నికి వైకల్యం లో అ వరోదా లు కలిగాయి మా అన్నయ్య లు ముగ్గురూ నన్ను ఎంతో ప్రేమతో చూశా రు   అయినా ఎన్ని అ వరోదాలు కలిగినా నేను బాల్యా న్ని చాలా బాగా ఎంజాయ్ చేశా నని చెప్పొచ్చు. చిన్నప్పుడు నాకు ఆయుర్వేద వైద్య o చేయించేవారు. అది ఒక ప్రక్రియ ఒక గొయ్యి తీసి ఇసుక పోసి అందులో కూర్చో పెట్టాలి, సూర్య రశ్మి తగలాలిఅలా ఎండలో కూర్చో బెట్టి నపుడు మా మూడో అన్నయ్య దగ్గరే ఉండే వాడు, కాఫీ తాగించే వాడు, అన్నం పెట్టే వాడు నవ్వించే వాడు నాకు బాధ కలగకుండా, అది తలచుకుంటే ఇప్పటికీ నా మనస్సు  ఆ ప్రేమ కి, ఆప్యాయత కి కరిగి పోతుంది. నేను చదువు కోడానికి నా పక్కనే ఉండి స్కూల్ కి తీసుకొని వెళ్ళేవాడు, మా అన్నయ్య లకు మా తాతగారు పద్యాలు (పోతన గారి భాగవతం లో )చెబుతూ ఉంటే నాకు వచ్చేసేవి. ఇక పండుగలు, వినాయక చవితి ఎంత గొప్పగా జరిగేదో వర్ణించలేను. పువ్వులన్నీ అన్నయ్యలు తెస్తే కూర్చుని అలంకరణ చేసే పని నాది. మా స్కూల్ లో మా సెక్షన్ లో ఆడపిల్లలకి నాయకురాలిని, ఎప్పుడు పదిమంది స్నేహితులతో ఉండేదాన్ని. మా అన్నయ్యలలో నడవలేక పోయినా కూర్చొని ఆడే ఆటలు ఆడేదాన్ని. నాకు ఎనిమిదో ఏట అభిలాష అనే కథ రాశా ను. మాఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. ఆ రోజు నేను చాలా సంతోషించాను. సంక్రాంతి గోబ్బె మ్మ లు, అట్లతద్ది ఊ య ల లు, పోలి స్వర్గం, అన్ని పండగలు అమ్మ చేయించేది, ఆ బాల్య స్మృతులు అన్నీ మధురా నుభూతులు అప్పట్నుంచే సమాజానికి ఏదో చేయాలని భా వనలుండేవి, అన్నిటి కంటే ముఖ్యం గా రోజు గుడి కెల్లడం దైవ దర్శనo చేసుకుని, పులిహోర ద ద్దోజనాలు ప్రసాదం తినడం ఎంతో ఆనందం గా ఉండేది. గుడికి వెళ్లినా బడికి వెళ్లినా, ఆట లా డీనా అన్నింట్లి ముందుండాలని తపన అన్నింటి కంటే ఆనందించాల్సిన విషయం. నేను ఆరో తరగతి లో ఉండగా తెలుగులో 98%మార్కులు వచ్చాయి. నా పేపర్ సెక్షన్ అంతా చూపించి మా తెలుగు టీచర్ నన్ను మెచ్చుకోవడం ఒక అనుభూతి, మరచి పోలేని విషయం. నన్ను కన్న తల్లి దండ్రులు బాల్యం లో పునాది వేశారు. ఒక రచయిత్రి గా, ఒక ఉద్యోగిని గా, సామాజిక సేవకురాలిగా, ఒక రాజకీయ నాయకురాలిగా నేను ఈ రోజు ఒక సుస్థిర మైన స్థానం లో ఉన్నానంటే నా తల్లిదండ్రులే కారణం.
వైఖల్యాన్ని ఆదిగమించి అడుగడుగునా ఎన్ని వైఫల్యాలు వచ్చినా పడి లేచిన కడలి తరంగం నా బాల్యం.
ఫోన్ నెంబర్ :9121863024
 శివలెంక నాగ ఉదయలక్ష్మి: రచయిత్రి. సంఘమిత్ర అనే మంత్లీని కొన్నాళ్లు  నడిపారు.దివ్యాంగులు అన్నిటామిన్న అని మాటలలో కాదు చేతల్లో కూడా చూపుతున్న సంఘసేవిక...పంపినవారు అచ్యుతుని రాజ్యశ్రీ
 
కామెంట్‌లు
Unknown చెప్పారు…
స్ఫూర్తిదాయకం ఆమె జీవిత పయనం.
అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు ఆమె నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
అభినందనలు ఇరువురికీ💐💐💐💐💐💐💐💐