కలం తల్లి అయ్యింది !?ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)

నా కలానికి వెంట్రుకలు మొలుస్తున్నవీ
ఆడ మగ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి!!

కలం కడుపులోని బిడ్డ ఇప్పుడిప్పుడే కదులుతుంది
బంగాళాఖాతంలో సుడిగుండం గండం గడిచేదెట్లాగో!?

మొండెం మాత్రం మాట్లాడుతుంది
తల ఇంకా తాకట్టు కోట్టులోనే ఉన్నట్లుంది!?

అంతా కల లానే ఉంది, కానీ కలలకు కళ్ళు చెవులు ఉన్నాయి!
రంగురంగుల కళ్ళు భోంచేసి హాయిగా నిద్రపోతున్నవీ
కల ఒకటే మేల్కొని ఉంది అర్ధరాత్రి దాకా

ఎగిసిపడుతున్న క్షణాల్ని చప్పరిస్తూ నాలుక ఎముకలా నరాల్ని అతికించుకుని తల పై పెత్తనం చేస్తోంది!?

లే మేలుకో అన్న కలం వెంట్రుకల్ని నిర్ధారించేది ఆడ మగా అన్న మీమాంసలో కలం కడుపులో కవలలకు అవకాశం ఇద్దామని పిండం అండగా నిలబడ్డది!?

ఒక్క కణం ఏం చేస్తుందని అనుకునేరు వేల లక్షల కోట్ల కణాల సైన్యం తయారుచేసిన శరీరం శబ్దం చేయదు యుద్ధం మాత్రమే చేస్తుంది!?

కలం ఆవులించేలోపల కథ ముగుస్తుంది కానీ పూరించిన శంఖం నిశ్శబ్దంగానే ఉంది సైన్యం గాడంగానే నిద్రపోతుంది!?

విజయం ఒక్కటే ఎగరేసిన జెండా గా ఆడ మగ  తేల్చేసిన జన్మకు ఏం పేరు పెడదాం!?
కలం ఇప్పుడు తల్లి అయ్యింది!?

కలానికి సలాం చేసిన కంటిరెప్పలు ఇకపై క్షణం కూడా మూతపడకుండా కలం గుండెతో పాటు కొట్టుకుంటూనే ఉంటాయి!?

Pratapkoutilya lecturer in Bio-Chem
8309529273,palem.
[8/9, 5:00 pm] Pratap Koutilya: Respected sir please post it in Molaka news
Thank you
Your s faithfully
Pratapkoutilya
కామెంట్‌లు