బూతుపురాణం
రాజ్యమేలుతుంది !
సిగ్గులేనితనం -
రాజకీయమయింది !!
------------------------------
కోర్టులో -
క్రిమినల్ కేసులు ....!
డబ్బుంటేచాలు ..
రాజకీయ రక్షణకవచం !!
----------------------------------
బహిరంగసభల్లో ...
మాటల దుర్వాసన
ప్రతిపక్షం అంటే...
చులకనేల ....?
-----------------------------------
పార్టీలమధ్య
కుమ్ములాట !
ప్రజలను విడదీసి
చిచ్చుపెట్టే క్రీడ ..!!
-----------------------------------
పదవిదొరికింది ,
నేరస్తుడు ....
నాయకుడైపోయాడు !
పరిపాలన ఎటో ..!!
------------------------------------
పరిపాలనలో మార్పు ..
వాడుకట్టింది ...
వీడుపడగొట్టడం !
ఓ కొత్తదనం!!
--------------------------------------
నానీలు ..!! > కవి :-డా.కె.ఎల్.వి.ప్రసాద్>హన్మకొండ *
ధన్యవాదములు.
బి.రామకృష్ణా రెడ్డి
సికింద్రాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి