సృష్టిమూలం నుండి
ఉన్నాడు గురువు
గురువు గారంటేను
ఒక కల్ప తరువు
ఆకుఆకుల నుండి
అపురూప.పాఠం
తేనె లొలికే మాట
శుభ వర్త మానం
నీడ లాగా నిన్ను
వెన్నంటి యుండు
గోడ వలెను గట్టిగ
నిలబెట్టు చుండు
పొరబాటు చేయగా
పట్టి శిక్షించును
పోరాట బాటలో
తర్ఫీదు లిచ్చును
హిమ నగము అంతటి
వ్యవస్థ గురువుగారు
చీకట్లో దివిటీగా
దారి చూపేవారు
అట్టి గురువుకు వందనాలు
మాకు గట్టిగా చేసేరు మేలు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి