బతుకు గమ్యపు గుమ్మం గురువే:- సోంపాక సీత భద్రాచలం

సూచక,వాచక,బోధక,నిషిద్ధ,
విహిత,కారణ , పరమరూపాల వారథిగా
గెలుపు ద్వారాలు తెరిపిస్తూ
మనచేత విజయకేతనాలు
ఎగురవేయించే నిత్య కార్యశీలి..

లౌకిక,అలౌకికతల
ఆనుపానులను రంగరిస్తూ
జ్ఞాన గవాక్షాలను తెరిపిస్తూ
సదా మనల్ని వెన్నంటివుండే
ఆచరణాత్మకరూపం..

రాతిని సానపట్టి వజ్రంగా
మలిచేకార్యంలో,
మట్టిముద్దనుపాత్రగా
మలిచే కుమ్మరంలో,
శిలను శిల్పంగా మలిచే నైపుణ్యంలో
ఇలా .. ఎన్నో.. ఎన్నెన్నో
బ్రతుకుల్ని గమ్యం చేర్చే పనిలో
రగిలిపోతున్న నిత్యాగ్నిహోత్రాలే గురువులు..

మనం మనఃస్ఫూర్తిగా పెట్టే
నమస్కారమేవారికిచ్చే అసలైన గురుదక్షిణ..

                

కామెంట్‌లు