మలుపు ....!-- డా. కె.ఎల్.వి.ప్రసాద్ హన్మ కొండ.

 నా అనారోగ్యం 
నాబాల్యాన్నిచిద్రం చేసి
నా బ్రతుకును....
అతలాకుతలం 
చేసినప్పుడు....
అన్నయ్య అందించిన 
ఆపన్నహస్తం ...నాకు
పునర్జన్మ నిచ్చింది ..
నా ఆత్మ విశ్వాసం 
వైద్యరంగంలో నన్ను 
ఉన్నతోద్యోగిని చేసింది !
నన్నొక రచయితగా 
తీర్చిదిద్దింది ....!!
     
కామెంట్‌లు
శ్యామ్ కుమార్ chagal చెప్పారు…
చాల బావుంది. Dr KLV ప్రసాద్ సమయానికి అన్న ప్రేమ మరియు ఆదరణ లభించింది . అన్న తనకు భగవంతుడు ప్రతి రూపం.