గేయం:-అయిత అనిత-జగిత్యాల

*ప* 
గురువులారా వందనం
జ్ఞానజ్యోతులారా అభివందనం

*చ* 
అజ్ఞానపు నిశీధిని
బోధనతో ఛేదిస్తూ
విజ్ఞానపు బాటచూపు
కాంతి కిరణం మీరేకదా

తప్పుచేస్తే శిక్షిస్తూ
తప్పటడుగు సరిదిద్దుతూ
సన్మార్గపు జాడతెలిపే
మార్గదర్శి మీరేకదా

*చ*
పాఠశాల నారుమడిలో
చదువు గింజనాటుతూ
అక్షరాల తోటలోన
విద్యాసుమం మీరేకదా

పుస్తకాల సారమంతా
మేథస్సుగా మలిచేస్తూ
శిశ్యుల భవితకు
స్పూర్తి దాత మీరేకదా

*చ*
అంకితభావమే
ఆస్తిగా మీరుతలచి
విద్యార్థుల మూర్తిమత్వ
అమరశిల్పి మీరేకదా

ఏమిచ్చిన తీర్చుకోము
మీ ఋణము ఎన్నటికీ
మీ మాటే మా బాటగ
సాగుటయే ధర్మంకదా

కామెంట్‌లు