*ఉపాధ్యాయులకు సన్మానం*


 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య అఫీషియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన టీచర్స్ మీట్ కార్యక్రమం లో మోటూరి శ్రీనివాస్ అయిత అనితల ఉత్తమసేవలకు గుర్తింపుగా మున్సిపల్ చైర్పర్సన్ భోగశ్రావణి, ఆవోపా అధ్యక్షలు పబ్బశ్రీనివాస్, రాజేషుని శ్రీనివాస్ చేతులమీదుగా సన్మానం పొందారు. వీరిని మిత్రులు , బంధువులు, ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఉపమానాలతో పోల్చలేనిది గురువు వ్యక్తిత్వం అని, సమాజనిర్మాతలు ఉపాధ్యాయులు అని అన్నారు. సర్వేపల్లి రాధకృష్ణన్ యొక్క సేవలను కొనియాడారు.


కామెంట్‌లు