వర్షాకాలం వచ్చును భారీ వర్షాలు పడవచ్చునుకాలమునుబట్టి ఆ..కాలము విధి నిర్వహించునుకాలముతెచ్చు సమస్యలకు కళ్లెము వేయుటసబబువినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము....!!నీరు పల్లమెరుగు నన్న మాట తెలిసినదే అందరికీవర్షముల ధాటికి పల్లపు ప్రాంతములు మునుఁగు !తెలిసిఉండికూడా తాత్సారము చేయుదురుకదావినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము ..!!పేదప్రజల గుడిసలే ప్రమాదములలో చిక్కుకొనుప్రకృతి వైపరీత్యములు పేదలనే మట్టు బెట్టు....ప్రజారాజ్యములో దిక్కులేనివారే పేదలు సుమావినుము కె ఎల్వీ మాట నిజము సుమ్మూ....!!నాయకులందరూ ముంపు ప్రాంతములు పర్యటించిపాత్రికేయులముందు వాగ్దానములెన్నో గుప్పింతురుతిరిగి వర్షాకాలమొచ్చువరకు కాలుముందుకుసాగదేవినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము....!!ఓటుకు నోటు పొంది నోరు మెదపలేని ప్రజలు....జ్ఞానమెరిగి ఓటుహక్కును వినియోగించు సోదరావినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము....!!ఉచితముల తాయిలాలతో ప్రజలనాకర్షించి ..పెడదోవ పట్టించి కడు ద్రోహము చేయుదురు ,గుంటనక్కల వలలో చిక్కుకొనరాదులే ....వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము...!!***
జీవనరాగం ...!! > ఆన్షీలు >రచనడా.కెఎల్వీ ప్రసాద్ >హన్మకొండ prasadkanety@gmail.com 9866252002.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి