ముత్యాలహారాలు;-కాట్రావత్ దివ్య9. వ. తరగతిZPHS నేరళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా
 109.
మంచి పనికి పూనుకో
చెడు బుద్ది మానుకో
మంచి పని అలవరచుకో
మంచి జ్ఞానం పొందుకో...
110.
పొద్దున్నే పిల్లలు
పొద్దున్నే వ్యాయామాలు
పొద్దున్నే సాధనలు
పొద్దున్నే సంతసాలు
111.
ఆవేశం వద్దురా
కోపం పెంచుకోకురా
నరాలను తెంచుకోకురా
కోపం మంచి కాదురా...
112.
చదువు జీవన రేఖములు
మంచి పని మన రాతలు
కష్టాలు మన సుఖాలు
త్యాగం మన జీవితాలు...
113.
కవితలు నీవు చదువుము
కవితలు నీవు రాయుము
గౌరవo నీవు పొందుము
కీర్తిని నీవు గడించుము

కామెంట్‌లు