:కులరక్కసి;-;-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371

 *ఆటవెలది*
కులముమతములనుచు కుమ్ములాటలుమాని
కలసియుండగలరు చెలిమిమీర
కాలగమనమందు కదలాలిముందుకు
శ్రీజనోటిమాట సిరులమూట
*2.తేటగీతి*
అంటరానితనంబునే యణగద్రొక్కి
కరముకరమునుకలుపుచు కాంక్షదీర
ఐకమత్యముతోనుండి యవనిమెచ్చ
మానవత్వము చాటాలి మహినిజనులు
*తేటగీతి*
పేదధనికులుయనుచును భేదమీడి
అందరుసమానమనవలె యందరెపుడు
కష్టసుఖములుపంచుతు ఇష్టముగను
సర్వహితమునుకోరాలి సర్వజనులు
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ఎప్పుడూ సమాజాన్ని చెడుగా చూస్తూ నీతి వాక్యాలు వల్లిస్తూ కవితలు రాస్తే,ఏం వస్తుంది. భాషా పరిజ్ఞానం ,సాహితీ ప్రక్రియల ప్రదర్శన తప్ప, యువత పాత్ర ఏమీ లేదా. మీలాంటి యువతరం ఎంతసేపు ఎన్ని రోజులు ఇలా నీతులు చెప్తారు. నడుము కట్టండి, మీరేం చేశారు అన్నది చెప్పండి. బురదను చూస్తూ కవిత రాయడం కాదు, ఒక పార పట్టి బురద ఎత్తు.
యువత మనసులో చేతల లో మర్పురావాలి. పద్యం కన్నా పని ప్రధానం.