*ఆడపిల్ల*;-బెజుగాం శ్రీజ* *గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేట* *చరవాణి:9391097371

 *తేటగీతి*
ఆడపిల్లలుపుట్టడం యలుసుయనుట
తప్పుతప్పోయిమానవా ధరణియందు
అబలకాదండివారలు సబలలనుచు
తెలుసుకోవలెనెపుడును తెలుగుబిడ్డ
*2. ఆటవెలది*
ఆడపిల్లపైన హత్యాచారంబును
చేయతప్పునగును చిత్తమందు
తల్లిగుర్తుకొచ్చి తనతప్పులెరుగరా
తెలిసిమసలగలరు దివ్యముగను
*3.తేటగీతి*
అమ్మలాంటిస్వభావంబెయాత్మలోన
ఆడపిల్లలేసతతమె యండగుండు
ఇంటికియదృష్టదేవత ఇంపుగాను
దైవముమనుష్యరూపేణదండిగాను
కామెంట్‌లు