మన ఘనమైన దీపావళి
జన సాంప్రదాయ రూపావళి
వస్తున్నది అది మస్తు ఉన్నది
వేడుక వెలుగులనే తెస్తున్నది !
మన దీపావళి దీపావళి
తరతరాల ఘన దీపావళి
వస్తున్నది వస్తున్నది అది
ముదములు కలిగిస్తున్నది!
మన దీపావళి దీపావళి
దివ్యమైన ఘన దీపావళి
భవ్యమైన జన కృపా వళి
సవ్యమైన ఓ గులేబకావళి !
మన దీపావళి దీపావళి
మెరిసి విరిసేఈ దీపావళి
ఘన ముత్యాల దీపావళి
మన పగడాల రత్నావళి !
దీపావళి మన ఈ దీపావళి
ప్రమిదల ప్రవాహ దీపావళి
వెలుగుల వెన్నెల రూపావళి
కలువల కన్నెలమా కథాకళి !
ఔటులను మనం కాల్చవద్దు
అవుటై వాటిని తిరిగి పేల్చవద్దు
అసలు కాలుష్యాన్ని పెంచవద్దు
సిసలుగ దానిని తొలగిస్తేనే ముద్దు!
టపాసుల కాల్చవద్దు
పటాటోపం చూపవద్దు
దీపాలను వెలిగిస్తే ముద్దు
పాపాలు తొలగుట కద్దు !
వెలుగుల జిలుగుల దీపావళి
తళుకుల బెళుకుల దీపావళి
తాను వస్తాదై ఇక వస్తున్నది
చాన ముస్తాబై అది మస్తున్నది !
రాక్షస నరకాసుర వధ వల్ల
ఆ క్షణంమే తిమిరావళి గుల్ల
మురిసిపోయే ముల్లోకాలెల్ల !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి